declining
-
ఖాళీ అవుతున్న కోచింగ్ సిటీ.. ఆత్మహత్యలే కారణమా?
కోటా: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన రాజస్థాన్‌లోని కోటాలోగల కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిపోతోంది. ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, హాస్టల్ యాజమాన్యాలు ఏంచేయాలో తెలియని స్థితిలో చిక్కుకున్నాయి.కోచింగ్‌పై తొలగిన బ్రమకోటాలోని కోచింగ్ సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది ఇక్కడి కోచింగ్ సెంటర్లపై ఇంతవరకూ ఉన్న బ్రమలు తొలగిపోవడమైతే, మరొకటి విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరగడమేనని చెబుతున్నారు. అలాగే లెక్కకుమించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వీరు అందించే విద్యానాణ్యత తగ్గిపోతున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.వేల కోట్ల టర్నోవర్‌కు గండికోచింగ్ సిటీగా పేరొందిన కోటాలో ప్రస్తుతం 1.10 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది మునుపటి కంటే 30-35 శాతం తక్కువ. రూ. 6.5 వేల కోట్ల విలువ కలిగిన పరిశ్రమ ఇప్పుడు రూ.3.5 వేల కోట్లకు దిగజారింది. ఇది కోటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. కోటాలో కోచింగ్ పరిశ్రమ 2000లో వేగంగా అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్ల ప్రగతి ఈ ఏడాదిలో ఊహించనంతగా దిగజారింది.కనీస హాస్టల్ అద్దె కూడా కరువు2018 నుంచి 2022 వరకు ఒకరికి నెలకు హాస్టల్ అద్దె రూ.15-16 వేలు వరకూ ఉండేది. ఇప్పుడు ఒకరి నుంచి రూ. 3000 కూడా దక్కడం లేదని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. నెలకు రూ.2500 అద్దె తీసుకున్నా 30 శాతం గదులు మాత్రమే నిండుతున్నాయంటున్నారు. స్థానికంగా చాలా మంది అప్పులు చేసి హాస్టళ్లు నిర్మించుకున్నారని, విద్యార్థుల కొరత కారణంగా ఆ రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని పలు హాస్టళ్ల యజమానులు అంటున్నారు.ఆత్మహత్యలే కారణమా?స్థానికంగా ఉన్న హాస్టళ్లు గతంలో విద్యార్థులను పీడించిమరీ డబ్బులు వసూలు చేశాయని, అందుకే వాటికి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కోటాలోని కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విరక్తి చెందడానికి ఇక్కడ చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2023లో కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువు ఒత్తిడే ఈ సంఘటనలకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా కోటాకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.ప్రముఖ కోచింగ్ సెంటర్లకు మరిన్ని బ్రాంచీలుమరోవైపు ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దేశంలోని వివిధ నగరాల్లో తమ కేంద్రాలను తెరిచాయి. 2020 వరకు 10 కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 80 నుండి 100 కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫలితంగా విద్యార్థులకు కోటా ఒక్కటే కాకుండా పలు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ పెద్ద బ్రాండ్ కోచింగ్ సెంట్లర్ల కారణంగా స్థానిక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.పరిష్కారం కోసం మల్లగుల్లాలుప్రస్తుతం కోటా కోచింగ్ పరిశ్రమకు కష్టకాలం నడుస్తోంది. దీనిని సవాలుగా తీసుకున్న హాస్టళ్ల యజమానులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరిష్కారం దిశగా యోచిస్తున్నారు. విద్యార్థుల భద్రత, వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే కోచింగ్ నాణ్యతను మెరుగుపరచడానికి, కొత్త కోర్సులను ప్రారంభించేందుకు కూడా కోచింగ్ సెంటర్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
నదులు ఎండిపోతున్నాయ్!
నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రమాదాలు...మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. → అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. → ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్ డోంగ్మే ఫెంగ్ తెలిపారు. → నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు.క్షీణిస్తున్న నదులు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. ముంచుకొస్తున్న వరద ముప్పు ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలిన్ గ్లీసన్ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో 61,573 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 865 మంది వైరస్ బారిన పడ్డారు. అంటే పాజిటివిటీ 1.40 శాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 7.80 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 2,484 మంది కోలుకోగా, మొత్తం 7.56 లక్షల మంది కోలుకున్నారు. ఒక్క రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,103 మంది బలయ్యారు. -
కరోనా కొత్త కేసులు 14,146
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 229 రోజుల కనిష్టానికి పడిపోవడం ఊరట కలిగిస్తోంది. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 3,40,67,719కు చేరుకుంది. శనివారం 11 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 14,146 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇక కరోనా యాక్టివ్ కేసులు రెండు లక్షలకు దిగువకి తగ్గిపోయాయి. ప్రస్తుతం 1,95,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 220 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఇప్పుడేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఒక్క రోజులోనే యాక్టివ్ కేసులు 5,786 తగ్గాయి. మొత్తం కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.57 శాతం ఉన్నాయి. ఇక కోవిడ్ రికవరీ రేటు 98.10 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా బారినపడి మరో 144 మంది మరణించారు. దీంతో మొత్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 4.52,124కి చేరుకుంది. కోవిడ్ టీకా డోసుల పంపిణీ వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. శనివారం ఒక్కరోజే 41,20,772 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 97 కోట్లను దాటేసింది. కరోనా మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.50 వేల సాయం లక్నో: కోవిడ్–19 మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సాయం అందించే విషయంలో సమగ్రమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. కరోనా ఆర్థిక సాయం పంపిణీకి జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లాల్లో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. -
చలి తక్కువ.. ఎండ ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. సీజన్ మొదట్లో వణికించిన చలి.. ఇప్పుడు కాస్త తీవ్రత తగ్గించింది. గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల మొదటి వారంలో రాష్ట్రం లో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదు కాగా.. ఇప్పుడు 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో చలి ప్రభావం అదే స్థాయిలో ఉంటుందని భావించినా ప్రస్తుతం ఉష్ణోగ్రతల నమోదులో మాత్రం వ్యత్యాసం కనిపిస్తోంది. కనిష్టం 18.6 డిగ్రీలు.. గరిష్టం 34.8 డిగ్రీలు.. రాష్ట్రంలో వాతావరణ శాఖ 12 సెంటర్లలో ఉష్ణోగ్రతల నమోదును రికార్డు చేస్తోంది. ఈక్రమంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. దుండిగల్‌లో 18.6 డిగ్రీల కనిష్ట, ఆదిలాబాద్‌లో 34.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దుండిగల్, నల్లగొండ మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీల నుంచి 3.7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దుండిగల్, ఆదిలాబాద్, నల్లగొండ మినహాయిస్తే మిగతా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 5.1 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. నీటి వనరులు భారీగా ఉండటంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు మాత్రం అమాంతం పెరుగుతుండటం గమనార్హం.. రెండ్రోజులు పొడి వాతావరణమే.. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. హిందూ మహా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వలన దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సుమారుగా నవంబర్ 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వివరించింది. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక–తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే అవకాశమున్నట్లు తెలిపింది. -
వినపడలేదా...ప్రసవ వేదన?
విజయనగరం ఫోర్ట్: రౌండ్‌ది క్లాక్ పనిచేసే పీహెచ్‌సీల్లో ప్రసవాలు అరకొరగానే సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా చేయలేకపోతున్నారు. జిల్లాలో నాలుగైదు పీహెచ్‌సీలు మినహా మిగతా చోట్ల ప్రసవాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. జిల్లాలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 44 ఉన్నాయి. వీటిలో ఒక పీహెచ్సీ మాత్రం లక్ష్యానికి చేరుకోగా... రెండు పీహెచ్‌సీలు లక్ష్యానికి చేరువగా ఉన్నాయి. నెలకు ఒక్కో పీహెచ్‌సీల్లో 25 ప్రసవాలు జరిగాలి. ఏప్రిల్ నుంచి ఆక్టోబర్ నెలాఖరు నాటికి ఒక్కో పీహెచ్సీలో 175 ప్రసవాలు జరగాలి. కానీ చాలా చోట్ల రెండంకెలకు చేరుకోవడమే గగనంగా కనిపిస్తోంది. ఏ పీహెచ్‌సీల్లో ఎన్నెన్ని? ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలాఖరునాటికి ఏడు నెలల్లో ప్రతి పీహెచ్సీలో 175 ప్రసవాలు జరగాల్సి ఉన్నా మొండెంఖల్లులో 248, బాగువలసలో 126, గురునాయుడు పేటలో 166 ప్రసవాలు, రామభద్రపురంలో 104 మాత్రమే జరిగాయి. ఇక నెలకు 10 ప్రసవాలు కూడ చేయని పీహెచ్‌సీలు ఉన్నాయి. తెర్లాంలో 64, తాడికొండలో 47, గోవిందపురంలో 47, మోపాడలో 62, పిరిడిలో 35, సీతానగరంలో 28, గర్భాంలో 42, గరివిడిలో 20, కర్లాంలో 10, గరుగుబిల్లిలో 36 , జియ్యమ్మవలసలో 58, రావాడ రామభద్రపురంలో 26, బొండపల్లిలో 11, చల్లపేటలో 21, దత్తిరాజేరులో 34, మెంటాడలో 52, మాదలింగిలో 20, గుర్లలో 17, బందలుప్పిలో 6, డోకశిలలో 52, కొమరాడలో 26, పి.బొండపల్లిలో 7, అలమండలో 31, జామిలో 37, కొత్తవలసలో 45, ఎల్.కోటలో 22, పెదమజ్జిపాలేంలో 26, వేపాడలో 18, వియ్యంపేటలో 35 ప్రసవాలు నిర్వహించారు. రిఫరల్స్కే అధిక ప్రాధాన్యం పీహెచ్‌సీలకు ప్రసవాలకోసం వచ్చే గర్భిణులను జిల్లా ఆస్పత్రికిగాని కేజీహెచ్‌కు గాని ప్రసవాలకోసం రిఫర్ చేసేస్తున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాదు... నిరుపేదలు సైతం సుదూరంలోని ఆస్పత్రికి వెళ్లలేక సతమతం అవుతున్నారు. వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం.. కొన్ని పీహెచ్‌సీల్లో నిర్దే«శించిన లక్ష్యం కంటే ఎక్కువగానే ప్రసవాలు జరుగుతుండగా మరి కొన్ని చోట్ల లక్ష్యానికి దగ్గరగా అవుతున్నాయి. తక్కువ ప్రసవాలు జరుగుతున్న వాటిల్లో లక్ష్యానికి అనుగుణంగా ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటిపై పదే, పదే వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం. – డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, డీఎంహెచ్ఓ -
జేఎల్ఆర్కు ట్రేడ్‌వార్ సెగ
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు జూలైలో భారీ క్షీణతను నమోదుచేశాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్ఆర్ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఫెలిక్స్ బ్రౌటిగమ్ తెలిపారు. జాగ్వార్ బ్రాండ్ సేల్స్ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్ రోవర్ అమ్మకాలు 24 శాతం క్షీణించి 25,152 యూనిట్లుగా నిలిచినట్లు వెల్లడించారు. ‘కీలక మార్కెట్లలో గత నెల అమ్మకాలు క్లిష్టతరంగా మారాయి. చైనాలో రిటైల్ సేల్స్ 46.9 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తేలికపాటి వాహన పరీక్షా విధానంలో జాప్యం వల్ల బ్రిటన్‌లో అమ్మకాలు 18.3 శాతం తగ్గాయి. ఉత్తర అమెరికాలో 9.5 శాతం తగ్గుదల నమోదైంది. టారిఫ్ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని వివరించారు. వాణిజ్య యుద్ధం కారణంగా కొనుగోలుదారుల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారాయన. -
చలి పంజా
చలి పంజా దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. రుతువులు కూడా సహజ కాలాన్ని మరచి మందగమనంతో సాగుతున్నాయి. చలి దుప్పటే ఎక్కువ కాలం జిల్లాను కప్పుతోంది. జనవరి ప్రారంభంలో శిశిర రుతువు (ఆకురాల్చే కాలం) ప్రారంభం కావాల్సి ఉండగా దాని ఊసే లేదు. ఉదయం పూట నులివెచ్చని గాలులు వీచి హాయి గొల్పాల్సి ఉండగా దాని జాడే లేదు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. చిలకలూరిపేటటౌన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జీవైన శైలిలో క్రమేణా మార్పులు సంభవిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వెలువడుతున్న కర్బన ఉద్గారాల ప్రభావంతో భూతాపం పెరిగిపోతోంది. ఫలితంగా కొన్ని రుతువుల మందగమనం కనిపిస్తోంది. కొన్ని రుతువులు కాలపరిమితులు రెట్టింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఏ సీజన్ ఎన్ని నెలలు కొనసాగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. శీతాకాల, వర్షాకాలాల పరిధి క్రమేణా తగ్గిపోతున్నాయి. రెండు నెలల నిడివిగా ఉండాల్సిన ఒక్కో రుతువు రెట్టింపు నెలలు కొనసాగుతున్నాయి. రుతువులు కూడా తారుమారు.. హేమంత ఋతువు (చలికాలం), గ్రీష్మ (వేసవి కాలం) రుతువుల మధ్య ఉన్న రెండు నెలల కాలాన్నే శిశిర రుతువు అని, దీన్నే ఆకురాలే కాలం అంటాం. ఈ రుతువులో చలి క్రమేణా తగ్గుముఖం పట్టి నులివెచ్చని గాలులు వీయాలిఉంది. జనవరి మాసాంతంలో ఈ రుతువు ప్రభావం ఇప్పుడు పూర్తి మారినట్లు కనిపిస్తోంది. మొదటి పక్షం రోజులు రాత్రి విపరీతమైన చలి వచ్చి తర్వాతి రోజుల్లో ఎండలు పెరుగుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జిల్లా అంతటా ఒకే రోజు రాత్రి ఉష్టోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోయిన రికార్డు 1936 డిసెంబర్ 31న నమోదైంది. మరో పదేళ్లకి 1946 లో ఒకరోజు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అంత తక్కువ సగటు ఉష్ణోగ్రత ఆదివారం (21 జనవరి 2018) అర్ధరాత్రి నమోదైంది. ఈ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా 16 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 25న 70 ఏళ్ల కిందట నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయని, వచ్చే గురువారం 14 డిగ్రీలకు పడిపోతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండు డిగ్రీల కనిష్టానికి చేరుకున్నా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు. చలితో పాటు పెరుగుతున్న ఎండ.. వాస్తవానికి జనవరి ముగింపు నాటికి పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతూ చలిగాలులు, మంచు పడటం చాలా వరకు తగ్గుముఖం పడుతూ ఉండాలి. కానీ గడిచిన ఐదేళ్ల నుంచి శీతోష్ణస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2014లో జనవరిలో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా ఈ ఏడాది జనవరిలో 32 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రత 2014లో 21 డిగ్రీలుగా నమోదు కాగా ఈ ఏడాదిలో ఈ నెలలో 16 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎండ పెరిగే కొద్దీ చలి తగ్గాల్సి ఉండగా సమాంతరంగా చలి కూడా పెరగడం గమనార్హం. అనేక రంగాలపై తీవ్ర ప్రభావం.. జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి తయారీ, పాడి పరిశ్రమ రంగాలపై చలి ప్రభావం పడింది. విద్యారంగంలో పరీక్షల ఫీవర్ మొదలు కావడంతో విద్యార్థులు చలిలో తెల్లవారుజామున లేవలేని పరిస్థితి. పాడి పరిశ్రమపై ఆధారపడే పోషకులకు మరో నెలపోతే పాలిచ్చే పశువులన్నీ ఒట్టిపోయే పరిస్థితి. నిర్మాణం, తయారీ రంగాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలు తెల్లవారుజామునే గ్రామాల నుంచి పల్లెల నుంచి పట్టణాలకు రావాల్సి ఉండటంతో రవాణా కష్టతరమవుతుంది. ఇక రహదారులను మంచుతెర కప్పుకోవడంతో ఉదయం 9 వరకూ వాహనం తీయలేని పరిస్థితి. అగ్ని పరీక్షలా డ్రైవింగ్.. చలి కాలంలో సర్వీస్‌లకు వెళ్లాలంటే దేవుడు గుర్తొస్తున్నాడు. ఒక వైపు మంచు, మరోవైపు చలి. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఎప్పుడు సూర్యోదయం అవుతుందా? అన్న ఎదురుచూపే మాకు దిక్కు. ప్రమాదాలు ఎక్కువ సంభవించే కాలం కూడా ఇదే. చలికి తట్టుకుని డ్రైవింగ్ చేయడం అగ్నిపరీక్షలా మారింది. – ఎస్.నాయక్, హైదరాబాద్ సర్వీస్ ఆర్టీసీ డ్రైవర్ రాత్రి షిప్టులు మానుకున్నా.. నెలలో 15 రోజుల మాత్రమే పరిశ్రమకు వెళ్తున్నా. రాత్రి షిఫ్టులు వేస్తే మానుకున్నా. ఈ చలిలో పనికి వెళ్లాలంటే భయమేస్తోంది. చలి తీవ్రత వల్ల ఎంతో మంది కార్మికులు పనులు మానుకుంటున్నారు. ఇది సామన్యులకు తీవ్ర నష్టం కలుగజేస్తోంది. ఆరోగ్యానికి ఓటు వేసి ఆగిపోతున్నాం. – కె.బాలు, రోజు కూలి -
ధాన్యం.. దైన్యం!
ఆశాజనకంగా లేని ధాన్యం దిగుబడి ప్రకృతి వైపరీత్యాలతో ఏటా క్షీణిస్తున్న వైనం విజయనగరం ఫోర్ట్ : జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపైనేఆధారపడి జీవిస్తున్నారు. ప్రధాన ఆహార పంట.. వరి. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం వెరసి జిల్లాలో రైతులకు ఈ పంట కలసి రావడం లేదు. గత ఎనిమిదేళ్ల కాలంలో ఒకట్రెండు సంవత్సరాలు మినహా.. మిగిలిన కాలమంతా వరి పంటకు అతివృష్టి లేదా అనావృష్టి వల్ల నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా ధాన్యం దిగుబడి తగ్గిపోతోంది. పంటచేతికి వచ్చే సమయంలోనే నష్టం ఏదో విధంగా నాట్లు వేశాం.. మంచిదిగుబడి వస్తుందని రైతులు ఏటా ఆశిస్తూ వస్తున్నారు. పంట పొట్టదశలో ఉన్నప్పుడు వర్షాలు కురవకపోవడం వల్ల ఒక ఏడాది.. పంట నీట మునగడం వల్ల మరో ఏడాది ఇలా వరి పంటకు నష్టం వాటిల్లుతోంది. హెక్టారుకు 3 వేల కేజీలకు మించి దిగుబడి రాని పరిస్థితి వరి పంట అనుకూలంగా పండితే హెక్టారుకు 4 వేల కేజీలు వరకు దిగుబడి వస్తుంది. అయితే వరుస ప్రకృతి వైపరీత్యాల కారణంగా హెక్టారుకు 3 వేలకు మించి దిగుబడి రావడం లేదు. 2014లో కాస్త దిగుబడి పెరగడం ఊరట కలిగించే విషయం. తగ్గిన ఆదాయం: వరి పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులకు ఆదాయం తగ్గిపోయింది. 4 వేల కేజీలు దిగుబడి వచ్చినట్లయితే హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు రైతులు ఆదాయం చూడగలరు. అయితే దిగుబడి తగ్గడం వల్ల హెక్టారుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకే ఆదాయ పరిమితమవుతోంది. ఆదుకునే హస్తం కరువు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని సకాలంలో ఇచ్చి రైతులను ఆదుకోవాలి. జాప్యం చేస్తే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎకరానికి రూ.10 వేల వరకు పరిహారాన్ని అందజేయాలి. విత్తనాలను, ఎరువులను ఉచితంగా సరఫరా చేయాలి. తుఫాన్ కారణంగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పంటనష్టం అంచనా వేసినప్పుడు నిబంధనలను పెట్టకుండా నష్టం జరిగిన రైతులందరినీ ఆదుకోవాలి. అయితే, జిల్లాలో ఈ పరిస్థితి అమలు కావడం లేదు. పంట నష్టపరిహారం పంపిణీలోనూ రాజకీయ ప్రమేయం ఎక్కువవుతోంది. నష్టం సంభవించి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందడం లేదు. 2010 నుంచి 2014 వరకు తుపాన్ల కారణంగా వరిపంటకు సంభవించిన నష్టం వివరాలు సంవత్సరం తుఫాన్ నష్టం(రూపాయలలో) 2010 లైలా రూ.కోటి 2010 జెల్ రూ.13.50 కోట్లు 2010 డిసెంబర్లో తుఫాన్ రూ.21 కోట్లు 2012 నీలం రూ.4.33 కోట్లు 2013 అక్టోబర్ వాయుగుండం రూ. 16.17 కోట్లు 2013 హెలెన్ రూ.80 లక్షలు 2014 హుద్‌హుద్ రూ.6.83 కోట్లు 2007 నుంచి జిల్లాలో సాగైన వరి పంట వివరాలు, ధాన్యం దిగుబడి వివరాలు సంవత్సం సాగు హెక్టార్లలో దాన్యం టన్నులలో 2007 1,24,000 3.71 లక్షలు 2008 1,24000 3.71లక్షలు 2009 1,05,000 2.31 లక్షలు 2010 1,26,000 3.24లక్షలు 2011 1,23,000 2.64లక్షలు 2012 1,19,000 3.06లక్షలు 2013 1,09,271 3.00లక్షలు 2014 1,18,950 4.86 లక్షలు