న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) అమ్మకాలు జూలైలో భారీ క్షీణతను నమోదుచేశాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్‌ఆర్ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఫెలిక్స్ బ్రౌటిగమ్ తెలిపారు. జాగ్వార్ బ్రాండ్ సేల్స్ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్ రోవర్ అమ్మకాలు 24 శాతం క్షీణించి 25,152 యూనిట్లుగా నిలిచినట్లు వెల్లడించారు.
‘కీలక మార్కెట్లలో గత నెల అమ్మకాలు క్లిష్టతరంగా మారాయి. చైనాలో రిటైల్ సేల్స్ 46.9 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తేలికపాటి వాహన పరీక్షా విధానంలో జాప్యం వల్ల బ్రిటన్‌లో అమ్మకాలు 18.3 శాతం తగ్గాయి. ఉత్తర అమెరికాలో 9.5 శాతం తగ్గుదల నమోదైంది. టారిఫ్ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని వివరించారు. వాణిజ్య యుద్ధం కారణంగా కొనుగోలుదారుల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment