
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో గ్యారెంటీపై ఫోకస్ చేసింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
తాజా సమీక్షలో.. ఈ పథకంపై విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇల్లులేని నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ స్థలం ఉంటే.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment