హిమాయత్‌నగర్: ఎంబీబీఎస్ చదవకుండానే చదివినట్లు విద్యార్థుల వివరాలు తమ సైట్లో ఉన్నాయని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌ఎంసీ) తెలిపింది. స్వదేశం, విదేశాల్లో చదివినట్లు ఇతరుల పేర్లతో కౌన్సిల్‌లో రిజిస్టర్ అయినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ హన్మంతరావు బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అవకతవకలను చూస్తే ఆయా విద్యార్థులు నిజంగా ఎంబీబీఎస్ చదివారా లేదా అనుమానం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం రెన్యువల్ చేసే సమయంలో బయటపడిన ఈ వ్యవహారంపై తాజాగా ఫిర్యాదు చేశారు.
రెండేళ్ల కిందట ఏసీబీకి.. ఇప్పుడు సిటీ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారు, ఏ సంవత్సరం చదువుతున్నారో తదితర సమాచారంతో వారి పేరుతో టీఎస్‌ఎంసీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థికి జీవితకాల రిజిస్టర్ నంబర్‌ను కేటాయిస్తారు. ప్రతి ఐదేళ్లకోసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఇలా రెండేళ్ల క్రితం రెన్యువల్ చేసుకోవడానికి వచ్చిన నలుగురి విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబర్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అప్లికేషన్‌పై రిజిస్టర్ నంబర్ ఒకటి ఉండగా.. దాన్ని రెన్యువల్ చేసే క్రమంలో ఫొటోతో కూడిన ఐడెంటిటీ మరో విద్యార్థిది వచ్చింది.
మరో విద్యార్థికి సంబంధించి రిజిస్టర్ నంబర్ ఒకటి ఉండగా పేరు మార్పు కనిపింది. ఇంకొకరు చైనాలో ఎంబీబీఎస్ చేసినట్లుగా వివరాలుండగా రిజిస్ట్రేషన్ నంబర్ వేరే వ్యక్తిది ఉంది. ఇలా నలుగురికి సంబంధించిన ఈ వ్యవహారం నాలుగేళ్ల క్రితం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ ఏసీబీ అధికారులకు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. వాళ్లు తాజాగా ఇది మాకు రాదని చెప్పి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో ఈ పంచాయితీ హైదరాబాద్ సిటీ సైబర్ క్రైంకు చేరింది. దీనిపైన ఫిర్యాదును స్వీకరించి కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ తెలిపారు.
నంబర్ ఒకరిది.. వివరాలు ఇంకొకరివి
Published Thu, Feb 24 2022 3:31 AM | Last Updated on Thu, Feb 24 2022 3:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment