ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది 35 శాతం మార్కులతోనే వివిధ కోర్సుల్లో చేరడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై త్వరలోనే మార్గ దర్శకాలను విడుదల చేస్తారు. రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ వంటి చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో ఈ విద్యార్థులు చేరాల్సి ఉంటుంది.
దీనికోసం వచ్చే నెల నుంచి వరుసగా ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈ సీట్లను పొందడానికి ఇంటర్ లేదా డిగ్రీలో నిర్ణీత శాతం మార్కులను సాధించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. దాంతో పరీక్షలకు ఫీజును చెల్లించిన ప్రతీ ఒక్కరినీ పాస్ చేశారు. ఇందులో కొందరిని 35 శాతం మార్కులతో పాస్ చేశారు. దాంతో ఆయా కోర్సుల్లో చేరడానికి ఇలాంటి విద్యార్థులకు వచ్చిన మార్కులు సరిపోవు. దీంతో 35 శాతం మార్కులతో సరిపెట్టాలని విద్యా శాఖ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment