
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రూ.39 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ స్థూలంగా ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం తాజా బడ్జెట్‌లో అవసరమైన చర్యలు చేపట్టలేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ నిర్మాణానికి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తితో శంకుస్థాపన చేయించి.. గుజరాత్‌లో గిఫ్ట్ సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పని చేస్తుందని బడ్జెట్‌లో ప్రకటించటం తెలంగాణ ప్రజలను మోసగించటమేనన్నారు.
తెలంగాణ ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని మాటమాత్రంగా పేర్కొని, రెండు రాష్ట్రాలకూ కలిపి కేవలం రూ.43 కోట్లు కేటాయించారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి, దీర్ఘకాలంగా పెండింగ్‌లోఉన్న రైల్వేలైన్ల పూర్తికి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన కూడా కరువైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment