సాక్షి, హైదరాబాద్: తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఆర్టీసీ బస్ టికెట్‌తో పాటే తిరుమల దర్శన టోకెన్‌నూ పొందొచ్చు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, తిరుమల తిరుపతి దేవస్థానాల మధ్య అవగాహన కుదిరింది. రోజూ వెయ్యి రూ.300 దర్శన టికెట్లను టీటీడీ ఆర్టీసీకి కేటాయిస్తుంది. ప్రయాణానికి రెండు రోజుల ముందుగా ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోవాలి.
బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌నూ బుక్ చేసుకోవాలి. వేర్వేరుగా రిజర్వు చేసుకునే వీలుండదు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే టీటీడీ టికెట్లు పొందే వీలుంది. సర్వీస్ చార్జీపై నిర్ణయం తీసుకుని సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాక టికెట్ల జారీ ప్రక్రి య ప్రారంభించే తేదీని వెల్లడించనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. దర్శనా నికి వెళ్లే ప్రయాణికులు 2డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌ను గానీ లేదా దర్శ నానికి 72 గంటల్లోపు పొందిన కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను గానీ సమర్పించాలి. ఈ అవకాశం కల్పించినందుకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment