రేపు రంజాన్‌ పండుగ  | Tomorrow is Ramadan | Sakshi
Sakshi News home page

రేపు రంజాన్‌ పండుగ 

Published Wed, Apr 10 2024 5:57 AM | Last Updated on Wed, Apr 10 2024 5:57 AM

Tomorrow is Ramadan - Sakshi

కనిపించని నెలవంక

బుధవారంతో ఉపవాసాల ముగింపు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా మంగళవారం నెలవంక కనిపించినట్టు ఎక్కడి నుంచి కూడా సమాచారం రాలేదని, దీంతో గురువారం ఏప్రిల్‌ 11వ తేదీన ఈద్‌–ఉల్‌–ఫితర్‌ (రంజాన్‌ పండుగ) జరుపుకోవాలని రుహియతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) కన్వినర్‌ సయ్యద్‌ ఇబ్రహీం హుస్సేనీ సజ్జాద్‌పాషా తెలిపారు.

మొజంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెలవంక నిర్ధారణ కమిటీల ద్వారా నెలవంక కనబడినట్లు సమాచారం అందలేదన్నారు.

బుధవారం రంజాన్‌ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించాలని, గురువారం షవ్వాల్‌ 1వ తేదీ (ఏప్రిల్‌ 11)గా పరిగణించి రంజాన్‌ పండుగ జరుపుకోవాలని సూచించారు. పండుగను శాంతిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కమిటీ తరుఫున రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement