Syed Ibrahim
-
రేపు రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా మంగళవారం నెలవంక కనిపించినట్టు ఎక్కడి నుంచి కూడా సమాచారం రాలేదని, దీంతో గురువారం ఏప్రిల్ 11వ తేదీన ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్ పండుగ) జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) కన్వినర్ సయ్యద్ ఇబ్రహీం హుస్సేనీ సజ్జాద్పాషా తెలిపారు. మొజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెలవంక నిర్ధారణ కమిటీల ద్వారా నెలవంక కనబడినట్లు సమాచారం అందలేదన్నారు. బుధవారం రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించాలని, గురువారం షవ్వాల్ 1వ తేదీ (ఏప్రిల్ 11)గా పరిగణించి రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచించారు. పండుగను శాంతిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కమిటీ తరుఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్‌గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
బంధువుల ఇంటికే కన్నం వేశాడు..!
ఇంట్లో ఉన్న వారంతా శుభకార్యానికి హాజరుకాగా దగ్గరి బంధువే చోరీకి పాల్పడ్డ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్మాయిల్ నగర్‌కు చెందిన సయ్యద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 3వ తేదీన రాత్రి జహంగీరాబాద్‌లోని కూతురు ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లాడు. కాగా, ఈ విషయాన్ని గమనించిన ఇబ్రహీం అల్లుడి తమ్ముడు తాజుద్దీన్(27) దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఇంటి తాళం పగులకొట్టి, అల్మారాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.21,300 నగదు చోరీ చేశాడు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వెళ్లి, బంధువులతో కలిసి పోయాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లి చూసిన ఇబ్రహీం దొంగతనం జరిగిందని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తాజుద్దీనే నిందితుడని తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు స్వాదీనం చేసుకున్నారు. కాగా, ఇబ్రహీం కూడా తన ఇంట్లో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.2 లక్షల నగదు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అది వట్టిదేనని తేల్చటం కొసమెరుపు. -
బీజేపీకి కలాం బంధువు గుడ్ బై
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నివసించిన బంగ్లాను స్మారకభవనంగా ప్రకటించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినందుకు నిరసనగా ఆయన సోదరుడి మనువడు ఏపీజే అబ్దుల్ షేక్ బీజేపీకి రాజీనామా చేశారు. కలాం మరణాంతరం గత సెప్టెంబర్‌లో బీజేపీలో చేరిన అబ్దుల్ షేక్ మూణ్నెళ్ల లోపే పార్టీకి గుడ్ బై చెప్పారు. పదవీ విరమణ అనంతరం కలాం ఢిల్లీలో రాజాజీ మార్గ్‌లోని 10 బంగ్లాలో ఉండేవారు. కలాం మరణించేవరకు అబ్దుల్ షేక్ కూడా అక్కడే ఉన్నారు. కలాం మరణాంతరం ఈ భవనాన్ని స్మారక చిహ్నంగా ప్రకటించాలని అబ్దుల్ షేక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ బంగ్లాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అబ్దుల్ షేక్ బీజేపీ నుంచి వైదొలిగారు. కలాం అన్న ఏపీజే మరకేయర్ మనువడు అయిన అబ్దుల్ షేక్ సొంతూరు తమిళనాడులోని రామేశ్వరంలో సామాజిక కార్యకర్త. -
టీఆర్ఎస్ వీడనున్న ఇబ్రహీం?
హైదరాబాద్ : టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం ఆపార్టీని వీడనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇబ్రహీం శుక్రవారం మధ్యాహ్నం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ నుండి టిఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్న ఇబ్రహీంకు బదులుగా టిజెఎసి రాష్ట్ర కోకన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్‌కు ఈ నియోజకవర్గం నుండి తెరాస టికెట్‌ను కెసిఆర్ ప్రకటించడంతో ఇబ్రహీం కంగుతిన్నారు. దాంతో భవిష్యత్తు రాజకీయాలపై ఆయన దృష్టి సారిస్తూ కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి డికె అరుణతో ఇబ్రహీం సంప్రదింపులు కొనసాగిస్తునట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.కాగా గతంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయన రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.