Crescent
-
రేపు రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా మంగళవారం నెలవంక కనిపించినట్టు ఎక్కడి నుంచి కూడా సమాచారం రాలేదని, దీంతో గురువారం ఏప్రిల్ 11వ తేదీన ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్ పండుగ) జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) కన్వినర్ సయ్యద్ ఇబ్రహీం హుస్సేనీ సజ్జాద్పాషా తెలిపారు. మొజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెలవంక నిర్ధారణ కమిటీల ద్వారా నెలవంక కనబడినట్లు సమాచారం అందలేదన్నారు. బుధవారం రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించాలని, గురువారం షవ్వాల్ 1వ తేదీ (ఏప్రిల్ 11)గా పరిగణించి రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచించారు. పండుగను శాంతిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కమిటీ తరుఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
నందలూరు రన్నింగ్‌స్టాప్ క్రూసెంటర్కు ఘన చరిత్ర
నందలూరు (రాజంపేట): బ్రిటీషు రైల్వే పాలకుల నుంచి కొనసాగిన ఎంతో ఘన చరిత్ర కలిగిన నందలూరు రైల్వే రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్ (మిగిలిన ఏకై క డిపార్టుమెంట్) ఎత్తివేతకు డెడ్‌లైన్ విధించారు. ముందుగా నందలూరుకు మోడర్ రన్నింగ్‌రూం కోటి వ్యయంతో మంజూరు చేశారు. దానిని అర్ధాంతరంగా రద్దుచేశారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో రన్నింగ్‌స్టాప్ డిపో ఏర్పాటు అనుకూలం కాదని చెబుతున్నా గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు పట్టించుకోలేదని.. వారి అనాలోచిత నిర్ణయాలతో నందలూరు డిపోకు మంగళం పాడారని రైల్వే కార్మిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. 6న క్రూసెంటర్ క్లోజ్.. వచ్చేనెల 6న రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్‌ను క్లోజ్ చేయనున్నారు. ఈ మేరకు సంబంధితశాఖ అధికారులకు గుంతకల్ నుంచి సంకేతాలు కూడా వచ్చేశాయి. ఇప్పటికే దశలవారీగా లోకోఫైలెట్లు, అసిస్టెంట్ లోకోఫైలెట్లు, గార్డులను గుంతకల్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసుకున్న డిపోకు తరలించారు. ఇక పూర్తి స్థాయిలో నందలూరు క్రూ సెంటర్‌ను మూసేసేందుకు రంగంసిద్ధం చేశారు. – రన్నింగ్‌స్టాప్ సిబ్బందిని ఇప్పటికే గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు ఎర్రగుంట్ల డిపోకు వెళ్లేలా మానసికంగా సిద్ధం చేశారు. వచ్చే నెల 6 నాటికి నందలూరులో క్లోజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి లోకోఫైలెట్లు, ఏఎల్పీ, గూడ్స్గార్డులు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు. దీంతో నాగిరెడ్డిపల్లె అర్బన్ పంచాయతీలో అద్దె ఇళ్లను ఖాళీ చేసుకుంటున్నారు. ఎర్రగుంటల్లో నివాసం ఉండలేమని వారు అంటున్నారు. కాలుష్యం లేని, తాగునీటి వసతి తదితర సమస్యలు లేని సమీప నగరాల్లో ఉండేందుకు అద్దె ఇళ్లను అన్వేషించుకుంటున్నారు. నాలుగేళ్లలో.. ఆది నుంచి ఒక పథకం ప్రకారం నందలూరు రైల్వేకేంద్రాన్ని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేసుకుంటూ వస్తోందని రైల్వే వర్గాల్లో చర్చ సాగుతోంది. క్రూ సెంటర్ క్లోజ్ నేపథ్యంలో ఆ పార్టీకి రాజంపేట, నందలూరు ప్రాంతీయుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. హాల్టింగ్, ఉన్న డిపార్టుమెంట్లను ఎత్తివేయడం తదితర వాటిని రైల్వే చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ నందలూరు రైల్వే వైభవం కోల్పోవడానికి నాంది పలికిందని.. ఇప్పుడు బీజేపీ పాలనలో పూర్తిగా గత వైభవంను క్లోజ్ చేశారనే విమర్శలు వెలువడుతున్నాయి. 170 ఏళ్ల తర్వాత నిర్వీర్యం దిశగా నందలూరు.. దక్షిణమధ్య రైల్వే చరిత్రలో గుంతకల్‌కు రైలుమార్గంలేని రోజులలోనే నందలూరుకు రైల్వేమార్గం ఉండేది. సదరన్ రైల్వే(తమిళనాడు)లో కీలక రైల్వే కేంద్రంగా విరాజిల్లింది. వేలాది మంది కార్మికులతో కళకళలాడింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు నందలూరులో నివాసాలు ఉండటంతో దేశవ్యాప్త కల్చర్ నందలూరులో కొనసాగింది. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడంలేదు. ఇక గూడ్స్ రైళ్లు కూడా ఆగకుండా వెళ్లిపోనున్నాయి. ఈ నేపథ్యంలో రన్నింగ్‌రూం, రైల్వే హాస్పిటల్, ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఎలక్ట్రికల్, రైల్వే ఇనిస్టిట్యూట్ తదితర విభాగాలు కూడా క్లోజ్ కానున్నాయి. ఆ విధంగా 170 ఏళ్ల చరిత్ర కలిగిన నందలూరు బీజేపీ పాలనలో గ్రామీణస్టేషన్గా అవతరించనున్నది. రన్నింగ్‌స్టాప్ డిపో క్లోజ్ చేస్తే .. నందలూరు రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్ వచ్చేనెల 6న క్లోజ్ చేయనున్నారు. కళకళలాడే నందలూరు ఇక కళ తప్పనుంది. 170 ఏళ్ల రైల్వేచరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. గంతకల్ రైల్వేడివిజన్ ఉన్నతాధికారులు నందలూరుపై కత్తికట్టి మరీ నిర్వీర్యం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నేరుగా రైల్వేబోర్డులో కదిలిక తీసుకురావాలి. నందలూరు పూర్వవైభవం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. – జంబు సూర్యనారాయణ, సర్పంచి, నాగిరెడ్డిపల్లె అర్బన్, నందలూరు జిల్లాలో రైల్వే అంటే నందలూరు జిల్లాలో రైల్వే అంటే నందలూరు.. నందలూరు అంటే రైల్వే అన్నట్లుగా కొనసాగింది. జిల్లాలో ఏ రైలు ఎక్కాలన్నా నందలూరుకు వచ్చేవారు. ఇప్పుడు ఏ రైలూ ఆగడం లేదు. ఉన్న విభాగాలను ఎత్తివేసే పరిస్థితులు నెలకొన్నాయి. నేడు నిర్వీర్యదిశగా పయనించడం బాధాకరం. నందలూరు రైల్వే కేంద్రానికి పూర్వవైభవానికి కలిసికట్టుగా కృషిచేయాలి. – కమాల్‌బాష, రిటైర్డ్ లోకోఫైలెట్, నందలూరు -
నేడు రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాధి, ఉత్తరాది రాష్ట్రాల్లో నెలవంక కనబడటంతో ఈ నెల 22న (శనివారం) రంజాన్ పండుగ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ(నెలవంక నిర్ధారణ కమిటీ) ప్రతినిధి ముఫ్తీ సయ్యద్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం మొజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆకాశంలో మబ్బులు ఉండటంతో హైదరాబాద్‌లో నెలవంక కనబడలేదని, తెలంగాణలోని పలు జిల్లాల్లో అది కనబడినట్లు నిర్ధారణ అయిందని, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించినట్లు సమాచారం అందిందని చెప్పారు. నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు ఉండి దైవప్రసన్నత కోసం పాటించిన ఉపవాసాలు అల్లా స్వీకరించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా శాంతిపూర్వక వాతావారణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పండుగ(ఈదుల్ ఫితర్) నమాజ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈద్గాలతోపాటు దాదాపు అన్ని మసీదుల్లో ఉందన్నారు. పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మైదానాల్లో కూడా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయా ఈద్గాలు, మసీదులు, మైదానాల్లో ఈదుల్ ఫితర్ నమాజ్ ఉదయం 6:30 గంట నుంచి 10:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆదివారం నెలవంక దర్శ నం ఇవ్వకపోవడంతో మంగళవారం (7వ తేదీ) నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుందని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ఖత్తారీ వెల్లడించారు. మొజాంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెలవంక నిర్ధారణ కమిటీల ద్వారా సమాచారం సేకరించిన అనంతరం సోమవారాన్ని షాబాన్ నెల 30వ తేదీ గా పరిగణించినట్లు పేర్కొన్నారు. 2019 రంజాన్ నెల ఉపవాసాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలు 7వ తేదీ నుంచి ఉపవాస దీక్షలు ప్రా రంభించాలని సూచించారు. రానున్న రంజాన్ మాసంలో శాంతిపూర్వక వాతావరణంలో ఉపవాస దీక్షలు పాటించాలని పిలుపునిచ్చారు. -
ఈ నెల 22న బక్రీద్
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ పండుగను ఈ నెల 22వ తేదీన జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుత్తారీ తెలిపారు. సోమవారం మోజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులోని మదురైలో నెలవంక కనబడినట్లు సమాచారం కాస్త ఆలస్యంగా అందినట్లు పేర్కొన్నారు. ఇస్లామియా కేలండర్ ప్రకారం ఏటా జిల్ హజ్ నెలలో నెలవంక దర్శనం ఇచ్చిన పదవ రోజు ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుంటారని అన్నారు. అలాగే ఈ ఏడాదీ నెలవంక దర్శనమిచ్చిన పదవ రోజైన ఆగస్టు 22న పండుగ జరుపుకోవాలని సూచించారు. -
ఆ ఆకుపచ్చ జెండాలపై బదులివ్వండి
న్యూఢిల్లీ: నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలను దేశంలో ఎగరేయరాదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా భవనాలు, మతపరమైన ప్రాంతాల్లో ఈ జెండాలను నిషేధించడంపై అభిప్రాయం చెప్పాలం టూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆకుపచ్చ రంగు జెండాలపై షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సమాధానం చెప్పేందుకు వీలుగా అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ పిటిషన్ కాపీని అందించాలని రిజ్వీకి ధర్మాసనం సూచించింది. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండాలు ‘‘ఇస్లాం విరుద్ధం’’ అని, అవి పాకిస్తాన్‌లోని ఓ రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉన్నాయని రిజ్వీ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
నెలవంక కనిపించె.. ఆనందం వెల్లివిరిసె
సాక్షి, కర్నూలు(కల్చరల్) : ఆకాశంలో రంజాన్ నెలవంక కనిపించింది..ముస్లిం కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నెల రోజులుగా సహేరీ, ఇఫ్తార్లతో సందడి సందడిగా సాగిన ఉపవాసాల ప్రతిఫలంగా ఈదుల్ ఫితర్ వచ్చేసింది. ముస్లిం కుటుంబాల నిండా ఆనందోత్సాహాల కెరటాలు ఉప్పొంగుతున్నాయి. నూతన దుస్తులు, అత్తర్ల ఘుమఘుమలు, దూద్ సేమియాలు, బిర్యానీల గుబాళింపులు, ఈద్ ముబారక్‌ల కరచాలనాలతో సందడి చేసుకునే పండుగ ముస్లిం ఇంటి గుమ్మాలలో ఆనంద తోరణాలు కడుతోంది. కర్నూలుతోపాటు నంద్యాల, ఆదోని, ఆత్మకూరు పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం ముస్లింలు రంజాన్ నెలవంకను దర్శించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల సమీపంలోని మైదానంలో రంజాన్ మాసపు చిట్టచివరి ఔట్ పేలింది. ఈదుల్ ఫితర్ పండుగకు సంబంధించిన సందేశాలు మసీదుల నుంచి ముస్లింలందరికీ మతపెద్దలు అందించారు. సిద్ధమైన ఈద్గాలు... నగరంలోని పాత ఈద్గా, కొత్త ఈద్గాల వద్ద ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభమవుతుంది. సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలోనూ ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను ఆహ్వానించే ఫ్లెక్సీలు వెలిశాయి. కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభం కానున్నది. జొహరాపురం, గడ్డ ఈద్గాలలో ఉదయం 7 గంటలకే నమాజు జరగనున్నది. పండుగ కోలాహలం... రంజాన్ పండగ కోసం ముస్లిం కుటుంబాలు చేసే కొనుగోళ్లతో కర్నూలులోని పాతబస్తీ సందడి సందడిగా కనిపించింది. శుక్రవారం సాయంత్రం బండిమెట్ట, పూలబజార్, వన్‌టౌన్, చిన్నమార్కెట్, పెద్దమార్కెట్ ప్రాంతాలు రంజాన్ పండుగ వంటకాల కోసం అమ్మే దినుసుల దుకాణాల వద్ద కోలాహలం కనిపించింది. ముస్లిం కుటుంబాలు బారులు తీరి దుకాణాల వద్ద సేమియాలు, పండుగ సామగ్రి కొనుగోలు చేశారు. కిడ్స్ వరల్డ్ సమీపంలో, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని దుకాణాల వద్ద బారులు తీరి జనం దుస్తులు కొనుగోలు చేయడం కనిపించింది. గుడ్‌బై టు హలీమ్... కర్నూలు నగరంలో రంజాన్ మాసం మొదలైనప్పటినుంచి మే 16వ తేదీ నుంచి వివిధ ప్రాంతాల్లో హలీమ్ అమ్మకాల జోరు కొనసాగింది. ప్రత్యేక సేమియానాలు వేసి సాయంత్రాలు హలీమ్ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. శనివారం సాయంత్రం చివరిసారిగా వన్‌టౌన్, గడియారం ఆసుపత్రి, యుకాన్ ప్లాజా, మౌర్యా ఇన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు హలీమ్ సేవిస్తూ దానికి గుడ్‌బై చెప్పారు. నమాజ్ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణ... నగరంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభం కానుండటంతో ఆనంద్ కాంప్లెక్స్, రాజ్‌విహార్ మీదుగా వెళ్లే బస్సులను దారి మళ్లించారు. నేషనల్ హైవే వైపుగా వాహనాలను నడిపే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈద్గాలను పరిశుభ్రం చేసి మంచినీళ్ల ఏర్పాటును నగర మున్సిపల్ కార్పొరేషన్ వారు పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో నగరంలో ఈదుల్ ఫితర్ పండుగ చేసుకునేందుకు పోలీసులు, పురపాలక శాఖ ఏర్పాట్లను చేస్తున్నారు. -
రంజాన్ షురూ !
- పుణ్యాల మూటకట్టుకునే సీజన్ పవిత్ర రంజాన్ మాసం - నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కర్నూలు(ఓల్డ్‌సిటీ): పుణ్యాలు మూట కట్టుకునే పవిత్ర రంజాన్ మాసం ఇది. అల్లా ఆరాధనలో గడిపే మాసం కావడంతోనే దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పవిత్ర ఖురాన్లో పేర్కొన్న ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. దీనినే పార్సీ భాషలో రోజా, అరబ్బీలో సౌమ్ అంటారు. పవిత్ర ఖురాన్ సంపూర్ణంగా భువిపైకి అవతరించిన దినం కూడా రంజాన్ మాసంలోనే ఉండటం విశేషం. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాంకు మూలస్తంభాలు. వీటిలో హజ్ తప్ప మిగతా నాలుగు మూల సూత్రాలు అమలయ్యేది ఒక్క రంజాన్ నెలలో మాత్రమే. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్పకుండా హజ్ యాత్ర నియమాన్ని కూడా సంపూర్ణం చేయాలి. ఇస్లాంలోకి ప్రవేశించే మార్గమే కలిమా. లాఇలాహ ఇల్లాల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ (సొల్లెల్లాహు అలైహివసొల్లం). ఆ సృష్టికర్తే (అల్లాయే) సమస్త సృష్టికి దైవం. ఆయన ప్రవక్త ముహమ్మద్ (సొ.అ.స.) అని అర్థం. ఈ సూత్రాన్ని విశ్వసించడమే కాకుండా ఆచరించాలి. రెండో మూలస్తంభం నమాజ్. నమాజ్‌ను నిత్యజీవితంలో రోజుకు ఐదుపూటలు పాటించాలి. రోజా, జకాత్ (దానధర్మాలు) వంటివాటికి రంజాన్ మాసంలోనే గొప్ప అవకాశం. మరో మూల సూత్రమైన నమాజు లేనిదే రోజా సంపూర్ణం కానేరదు. ప్రతి నమాజులోనూ కలిమా పఠనం జరుగుతుంటుంది. ఒక్క హజ్ తప్ప మిగతా మూల స్తంభాలను నిలబెట్టడంలో రంజాన్ మాసం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇందులో ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. సమయపాలన ముఖ్యం: ధర్మనిష్ఠతో ఉపవాసాలు ఉండాలి. నిర్ణీత సమయాల్లోనే సహెర్, ఇఫ్తార్లు పాటించాలి. అందరూ ఒకేసారి కచ్చితమైన వేళలు పాటించేందుకు వీలుగా కర్నూలు నగరంలో ఔటు పేల్చే విధానం ఉంది. ఉపవాసంలో శరీరానికే కాకుండా మనసుకూ కళ్లెం వేయాల్సి ఉంటుంది. మంచి దృష్టితో చూడాలి. మంచినే పాటించాలి. చెడుకు దూరంగా ఉండాలి. ఐదుపూటలా విధిగా నమాజు చేయాలి. ఖురాన్ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లా నామస్మరణ, అల్లాచింతన వంటివి విరివిగా చేయాలి. రంజాన్ నెలలో చేసే ఏ పవిత్ర కార్యానికైనా 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. దీంతో ఈ మాసంలో దాన ధర్మాలు విరివిగా చేస్తారు. మాసపు చివర్లో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి. ఆర్థికస్థోమత కలిగిన వారు జకాత్ దానం చేయాలి. ప్రతి మసీదులోనూ తరావీలో ఖురాన్ పఠనం కర్నూలు నగరంలోని ప్రతి మసీదులోనూ ఇటీవల తరావీలో ఖురాన్ పఠనం తప్పనిసరి చేశారు. పవిత్ర ఖురాన్లో 30 పారాలు ఉంటాయి. రోజుకో పారా చొప్పున నెల మొత్తాన్ని పఠిస్తారు. గతంలో బహు కొద్ది మసీదుల్లో మాత్రమే తరావీలో ఖురాన్ పఠనం పఠించే వారు. ప్రస్తుత కాలంలో ఖురాన్ కంఠస్థం చేసే (హాఫిజ్ల) సంఖ్య మెరుగ్గా ఉండటంతో ప్రతి మసీదులోనూ రంజాన్ మాసంలో ఒక హాఫిజ్‌ను ఏర్పాటు చేసుకుని నెలమొత్తం మసీదుల్లో సంపూర్ణం ఖురాన్ పఠనంతోనే తరావీ నమాజులు పాటిస్తున్నారు. నియమాలు.. మతగ్రంథాల ప్రకారం వయోజనులైన స్త్రీపురుషులందరూ విధిగా రోజా దీక్ష పాటించాలి. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్థులు, ప్రయాణంలో ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అయితే వ్యాధిగ్రస్థులు కూడా ఆరోగ్యం చేకూరిన తర్వాత ఆ రోజాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. రంజాన్ అంటే పాపాలను దహించివేయుట అనే అర్థం వస్తుంది. ఉపవాసదీక్షలు అనేవి మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేవిగా ఉండాలి. సాధ్యమైనంత మేరకు పుణ్యకార్యాలు చేపడుతుండాలి. -
రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆకాశంలో నెలవంక శుక్రవారం సాయంత్రం కనిపించకపోవడంతో.. శనివారం తప్పనిసరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని.. ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్నట్లు కర్నూలు ప్రభుత్వ ఖాజీ సలీంబాషా ఖాద్రి ప్రకటించారు. హిలాల్ కమిటీ తీర్మానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రంజాన్ మాసపు ఉపవాసాలు అల్లాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్నారు. ఐదుపూటలా నమాజుతో పాటు తరావీ నమాజు చేయాలని, ఉపవాసాల్లో ధర్మనిష్ఠ పాటించాలని సూచించారు.