
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆదివారం నెలవంక దర్శ నం ఇవ్వకపోవడంతో మంగళవారం (7వ తేదీ) నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుందని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ఖత్తారీ వెల్లడించారు. మొజాంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెలవంక నిర్ధారణ కమిటీల ద్వారా సమాచారం సేకరించిన అనంతరం సోమవారాన్ని షాబాన్ నెల 30వ తేదీ గా పరిగణించినట్లు పేర్కొన్నారు. 2019 రంజాన్ నెల ఉపవాసాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలు 7వ తేదీ నుంచి ఉపవాస దీక్షలు ప్రా రంభించాలని సూచించారు. రానున్న రంజాన్ మాసంలో శాంతిపూర్వక వాతావరణంలో ఉపవాస దీక్షలు పాటించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment