సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సంస్థానం.. అధికారికంగా స్వతంత్ర భారత దేశంలో విలీనం అయ్యింది 1948 సెప్టెంబర్ 17వ తేదీన. ఈ తేదీపై రాజకీయంగానూ ఎన్నో ఏళ్ల నుంచి చర్చ నడుస్తోంది కూడా. తాజాగా.. శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అంతేకాదు.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.
రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టి.. ఈ ఏడాది సెప్టెంబర్17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.
ఇదీ చదవండి: సెప్టెంబర్ 17 గురించి అమిత్ షాకి ఒవైసీ లేఖ
Comments
Please login to add a commentAdd a comment