
సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్ పర్యటనలో భాగంగా శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం అజ్మీర్ దర్గాను సందర్శించడంతో పాటు పలు దేవాలయాల్లో పూజలు చేశారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించేందుకు వెళ్లిన కవితకు దర్గా పెద్దలు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం దర్గా పెద్దలతో కవిత భేటీ అయ్యారు.
మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని దర్గా పెద్దలు కొనియాడటంతో పాటు తెలంగాణ లౌకికత్వానికి ప్రతీకగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. అజ్మీర్ సందర్శన తర్వాత రాజస్తాన్‌లోని పుష్కర్, శ్రీనాథ్ జీ దేవాలయాలను కూడా కల్వకుంట్ల కవిత సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment