సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అనూహ్య విజయంతో టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ ఎదురైంది. 2018లో టీఆర్‌ఎస్ నేత దివంగత సోలిపేట రామలింగారెడ్డి 54.36 శాతం ఓట్లను కైవసం చేసుకుని భారీ ఆధిక్యంతో గెలుపొందగా తాజా ఉప ఎన్నికలో పరిస్థితి తారుమారైంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగినా టీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో పోలయిన ఓట్లలో భారీ గండిపడింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 38.4 శాతం ఓట్లు రాగా, సమీప టీఆర్‌ఎస్ ప్రత్యర్థి సోలిపేట సుజాతకు 37.8 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 13.4 శాతం ఓట్లు దక్కాయి.
2018లో మొత్తం చెల్లుబాటయిన ఓట్లలో విజేత, పరాజితకు మధ్య 38.2 శాతం వ్యత్యాసం ఉండగా, తాజాగా ఓట్ల వ్యత్యాసం కేవలం 0.65 శాతం ఉండటం ఉత్కంఠ పోరు ఏస్ధాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఏకంగా 62,500 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. 2014, 2018 ఎన్నికల నుంచి రఘునందన్‌రావు ఓట్ల శాతం గణనీయంగా పెరగ్గా, గత రెండు ఎన్నికల్లోనూ 50 శాతంపైగా ఓట్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల్లో 37 శాతానికి పడిపోవడంతో ఓటమి ఎదురైంది. భర్త మరణంతో బరిలోకి దిగిన సోలిపేట సుజాతకు సానుభూతి కలిసివస్తుందని ఆశించినా, నియోజకవర్గంలో మంచి సంబంధాలు కలిగి, యువ ఓటర్లు అండగా నిలవడంతో రఘునందన్‌రావును విజయం వరించింది. చదవండి : గందళగోళంలో కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment