కుమారుడిపై ప్రేమతో గుడి... | Warangal Chennaraopet Man Constructs Temple For Deceased Son | Sakshi
Sakshi News home page

కుమారుడిపై ప్రేమతో గుడి...

Published Sat, Dec 11 2021 1:26 PM | Last Updated on Sat, Dec 11 2021 2:11 PM

Warangal Chennaraopet Man Constructs Temple For Deceased Son - Sakshi

సాక్షి, వరంగల్‌: కుమారుడు మృతి చెందినా.. అతడిపై ఉన్న ప్రేమను మరిచిపోలేక ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టించాడు ఓ తండ్రి. ఆ విగ్రహాన్ని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. 

వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అక్కల్‌చెడ గ్రామానికి చెందిన బోనగరి సారయ్య కుమారుడు హరిప్రసాద్‌ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో జ్ఞాపకాలను మరచిపోలేని తండ్రి విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టించారు. కాగా, దానిని దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమారుడు నిత్యం కళ్లెదుటే కనిపించేలా ప్రతి రూపం ఏర్పాటు చేసిన సారయ్యను అభినందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement