![Warangal resident developed the two in one hybrid bicycle - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/4/2_1.jpg.webp?itok=wMnZGncI)
హన్మకొండ: సౌరశక్తి, ఎలక్ట్రిసిటీ రెండింటిని వినియోగించుకుంటూ బ్యాటరీతో నడిచే సైకిల్‌ను వరంగల్ రూరల్ జిల్లా యువకుడు తయారు చేశాడు. వరంగల్ రూరల్ జిల్లాలోని దుగ్గొండి మండలం గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు తయారుచేసిన ఈ సైకిల్‌ను గంట పాటు చార్జింగ్ పెడితే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ సైకిల్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని రాజు తెలిపాడు. చార్జింగ్ అయిపోతే సాధారణ సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లవచ్చని పేర్కొన్నాడు.
సుమారు రూ.20 వేల వ్యయంతో తయారు చేసిన ఈ హైబ్రిడ్ సైకిల్‌ను చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ గురువారం హన్మకొండ బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా సైకిల్‌ను రూపొందించిన రాజును అభినందించారు. రాజును ప్రోత్సహించడానికి తాను ఒక సైకిల్ కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పర్యావరణహిత సైకిల్ వాడటం ద్వారా కాలుష్యాన్ని అరికట్టిన వాళ్లమవుతామని చీఫ్‌విప్ పేర్కొన్నారు.
చదవండి: కేవలం రూ.2500కే జియో 5జీ ఫోన్
Comments
Please login to add a commentAdd a comment