సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూరు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను దేవిప్రియ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా దేవీప్రియకు మంచిపేరుంది. "గాలిరంగు" కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు.
‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కవిగా గుర్తింపు పొందారు. దేవీప్రియ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు... కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా దేవీప్రియ ఎంతో కృషి చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు "గాలిరంగు" రచన మచ్చుతునకగా వర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment