
ప్రమాద దృశ్యాలు
సాక్షి, కరీంనగర్ : అతివేగం ఓ యువకుడి ప్రాణాల మీదకి తెచ్చింది. బస్సును ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వచ్చిన మరో బస్సును ఢీ కొట్టాడు. ఫలితంగా నుజ్జునుజ్జయిన టాటా ఏస్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి బయటికి రాలేక నరకయాతన అనుభవించాడు. జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద శనివారం జరిగిన ఈ ప్రమాదం టాటా ఏస్ వాహనం డ్రైవర్ అజాగ్రత్తను తేటతెల్లం చేసింది. ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించిన టాటా ఏస్ వాహనం డ్రైవర్ ముస్తాబాద్ అశోక్ ఎదురుగా వచ్చిన మరో బస్సును ఢీ కొట్టాడు. దీంతో టాటా ఏస్ క్యాబిన్ నుజ్జునుజ్జయి క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు.
బయటికి రాలేక ఆర్తనాదాలు చేశాడు. అయ్యో పాపం అంటూ స్థానికులు అతడ్ని బయటికి లాగేందుకు ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. భారీ క్రేన్ తీసుకువచ్చి బయటికి తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి టాటా ఏస్ వాహనం డోర్ కట్ చేసి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన అశోక్‌ను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.
చదవండి, చదివించండి : వైరల్: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్
Comments
Please login to add a commentAdd a comment