సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆవేదనను తీర్చేవారే లేరని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపో తున్నాయని ఆందోళన చెందారు. గురువారం ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో స్పందిం చారు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతున్నాయని మండిపడ్డారు.
కల్లాల్లో కయ్యాలు పెడుతూ, హస్తినలో దోస్తానా చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. పాలకులు ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులు చనిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను రైతు హంతకుడిగా అభివర్ణించారు. ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కనీసం పెన్షన్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment