బాల్య వివాహాలను అరికట్టాలి
ధారూరు: బాల్య వివాహాల నియంత్రణకు సాధన స్వచ్ఛంద సంస్థ ద్వారా తీసుకుంటున్న చర్యలు సంస్థ నిర్వాహకుడు చిక్కు రాహుల్ మంగళవారం నేతలకు వివరించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, అటవీశాఖ మంత్రి కొండా సురేఖలను కలిసి సంస్థ కార్యకలాపాలను తెలిపారు. హైదరాబాద్‌లోని వారి నివాసాలకు వెళ్లి కలిసిన ఆయన తమ సంస్థ ప్రజల్లోకి వెళ్లి బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తుందని చెప్పారు. ఆడ పిల్లల మేలు కోసం సాధన సంస్థ చేస్తున్న కృషిని స్పీకర్, మంత్రి అభినందించారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు.


