చురుగ్గా జాతర ఏర్పాట్లు
కొనసాగుతున్న హెలిపాడ్ పనులు
దుద్యాల్: పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 21న రానున్నారు. అందుకుగాను అధికారుల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. శనివారం ఎస్‌ఐ యాదగిరి, ఆలయన చైర్మన్ జయరాములు, ఆర్‌అండ్‌బీ అధికారులు సురేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. హెలిపాడ్ పనులు, వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఆలయ కమిటీ సభ్యులు నర్సింలు, యాదయ్య, వెంకటయ్య గౌడ్, నర్సిములు, మునికుమార్, రాములు తదితరులు ఉన్నారు.
21న ముఖ్యమంత్రి రాక
Comments
Please login to add a commentAdd a comment