ఆడపిల్లలు ఉన్నతంగా రాణించాలి
తాండూరు రూరల్: ఆడపిల్లలు సైతం అన్నిరంగాల్లో రాణించాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆశాలత అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జినుగుర్తి గేట్ వద్ద ఉన్న కేజీబీవీ హాస్టల్లో ‘బేటీ బచావో– బేటీ పడావో’దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాలత మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. పైలెట్లుగా, నౌకాదళాల్లోనూ ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. అనంతరం పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ కేజీబీవీ జట్లు కబడ్డీ, ఖోఖో పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో యాలాల ప్రథమ స్థానం సాధించగా, పెద్దేముల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో మహిళ సాధికారిత కేంద్ర అధికారులు వరలక్ష్మి, రాందాస్, ప్రత్యేకాధికారులు రాజేశ్వరి, మంగమ్మ, పీడీలు అనంత య్య, బుగ్గప్ప, రాము, పీఈటీ వసుంధర, గోపిక, రజిత, శ్రీలత, బాలమణి, నందు పాల్గొన్నారు.
కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆశాలత
Comments
Please login to add a commentAdd a comment