జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి
అనంతగిరి: జాతీయ లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం వికారాబాద్‌లోని కోర్టు ఆవరణలో ఆయన జిల్లా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఠాణాల వారీగా రాజీకి సిద్ధంగా ఉన్న కేసుల వివరాలపై ఆరా తీసి కేసులు పరిష్కరించాలన్నారు. చిన్న చిన్న తగాదాలు, మోటార్ వాహనాల కేసులు, ఇతర రాజీపడే కేసుల విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చొరవ తీసుకోవాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమనే విషయాన్ని తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, పీపీలు దీపారాణి, అన్వేష్‌సింగ్, సమీనాబేగం, జిల్లా ఆబ్కారీ శాఖ అసిస్టెంట్ సూపరిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మోమిన్‌పేట ఎస్‌ఐ అరవింద్, సంబంధిత అధికారులు, తదితతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment