
నాబార్డు నిధుల కరదీపిక ఆవిష్కరణ
అనంతగిరి: నాబార్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్(పీఎల్‌పీ) కరదీపికను అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రాధాన్యతారంగానికి రూ.7432.51 కోట్లుగా ఆర్థిక అంచనా వేసిందని చెప్పారు. బ్యాంకులు చురుగ్గా రుణాలు అందజేసి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం అకిల్‌పున్నా, ఎల్‌డీయం యాదగిరి, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, జిల్లా మత్య్స శాఖ అధికారి వెంకయ్య, ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమవ్వాలి
ఎస్పీ నారాయణరెడ్డి
అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదయిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి ఫైల్స్ పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఫైల్స్ పెండింగ్ పెట్టొద్దన్నారు. ప్రతీ పోలీస్ అధికారి ఫంక్షనల్ వర్టికల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కన్వెక్షన్ శాతాన్ని పెంచాలని చెప్పారు. పీఎస్‌ల వారీగా ప్రతీ శనివారం సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. డయల్ 100కు వచ్చే ఫోన్ కాల్స్‌పై నిర్లక్ష్యం చూపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హనుమంతరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు యాదయ్య
కుల్కచర్ల: యాదవులు హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య అన్నారు. మంగళవారం చౌడాపూ ర్ మండలం పుర్సంపల్లిలో యాదవ సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, ఉపాధ్యక్షులుగా రమేశ్, సత్తయ్య, కమిటీ సభ్యులుగా నరేష్, శ్రీనివాసులు, వెంకట్రాములు, రాజేష్, శేఖర్, కృష్ణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా మండల కమిటీలను బలోపేతం చేస్తామన్నారు.
నందనవనం హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సరూర్‌నగర్ మండలం నందనవనం మండల ప్రజా పరిషత్ పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రజితపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్కూల్ ఆవరణలో మాజీ కార్పొరేటర్, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటినందుకు గానూ ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజీసీఎస్ – 1964 ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదని అన్నారు. ఈ మేరకు ఒక రాజకీయ నాయకుడి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు.

నాబార్డు నిధుల కరదీపిక ఆవిష్కరణ

నాబార్డు నిధుల కరదీపిక ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment