చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
మోమిన్‌పేట:ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. అంరాధికలాన్ గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్(42) కుటుంబ అవసరాల కోసం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొడుకుకు చికిత్స చేయించేందుకు అప్పు లు చేశాడు. ఇవి తీరే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గత ఆదివా రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమ నించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు.
కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మూగజీవి నరక యాతన
యాలాల: చెట్టు కొమ్మ విరిగి పడటంతో ఓ కాడెద్దు కదల్లేని స్థితిలో నరక యాతన అనుభవిస్తోంది. యాలాలకు చెందిన గడ్డం సత్యప్పకు చెందిన ఎద్దును పొలం సమీపంలోని వేపచెట్టు కింద కట్టేశాడు. సోమవారం సా యంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు రావడంతో పెద్ద కొమ్మ విరిగి ఎద్దు నడుము పై పడింది. దీంతో లేచినిలబడలేక విలవిల్లా డుతోంది. జీవనాధారమైన ఎద్దు పరిస్థితిని చూసిన రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. గిర్దావర్ శివచరణ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంచార పశు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి, వైద్యం అందించాలని రై తుకు సూచించారు. ఎద్దు విలువ రూ.90వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.


