కేంద్ర మంత్రి బండిపై ఫిర్యాదు
అనంతగిరి: బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండిసంజయ్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం వికారాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి ఆధారాలున్నా బయటపెట్టాలన్నారు. అవాస్తవ మాటలతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను, కేసీఆర్ అభిమానులను మా మనస్సును గాయపరిచారన్నారు. ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, నాయకులు అశోక్, అనిల్, రాజేందర్, అనిల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ధారూరు: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. పార్టీ అభిమానులుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని, బండిసంజయ్‌పై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు ఎస్‌ఐ అనితకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ధారూరు మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు చిన్నయ్యగౌడ్, జైపాల్‌రెడ్డి, రహమతుల్లాఖాన్, విజయకుమార్, మహేశ్, పాల్గొన్నారు.


