కొడంగల్ రూరల్: కొడంగల్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నూతన కమిటీని మంగళవారం ఎలక్షన్ ఆఫీసర్ పీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా పి.వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బసవరాజు, జనరల్ సెక్రటరీగా బి.వెంకటయ్య, జాయింట్ సెక్రటరీగా కె.రమేష్, కోశాధికారిగా శ్రీనివాస్ ఆనంద్, లైబ్రేరియన్ కార్యదర్శిగా బి.కృష్ణయ్య, కల్చరల్ కార్యదర్శిగా కె.రాము లు, స్పోర్ట్స్ కార్యదర్శిగా ఎస్‌డీ.మొహీద్, లేడీ రిప్రజెంటేటివ్‌గా భాగ్యలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మర్పల్లి తైబజార్ వేలం
రూ.5 లక్షలకు దక్కించుకున్న నాగేష్
మర్పల్లి: మర్పల్లి తైబజార్‌కు మంగళవారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన నలుగురు వేలం పాటలో పాల్గొన్నారు. తలారి నాగేష్ రూ.5లక్షల 11 వేలకు తైబజార్ దక్కించుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. గ్రామసభలో నిర్ణయించిన ప్రకారం వ్యాపారుల నుంచి ఏడాది పాటు రుసుం వసూలు చేసుకోవచ్చని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రుసుం వసూలు చేస్తే తైబజార్ లైసెన్స్ రద్దు చేసి వేలం పాటలో రెండో వ్యక్తిగా నిలిచిన వారికి అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాములు యాదవ్, మాజీ సర్పంచ్ పాండు నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శేఖర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షడు జగదీశ్, జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు సర్వేశ్, స్థానిక నాయకులు నర్సింలు యాదవ్, మారుతి, శివ, భరత్, వీరేశం, సీహెచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దుకాణాలకు వేలం
ధారూరు: ధారూరు గ్రామ పంచాయతీకి చెందిన దుకాణాలకు మంగళవారం గ్రామ కార్యదర్శి అంజానాయక్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి గాను 8 దుకాణాలకు బహిరంగ వేలం వేశారు. మొదటి దుకాణాన్ని రూ.40 వేలకు మహబూబ్‌ఖాన్, రెండో దుకాణాన్ని రూ.48 వేలకు ఇ బ్రహీం, మూడో దుకాణాన్ని రూ.48,500 లకు దావూద్,4వ దుకాణం రూ.48 వేలకు ఇబ్రహీం, పాత దుకాణాల్లో 5వ షాపును రూ.28 వేలకు మహబూబ్‌ఖాన్, 6వ దుకాణం రూ.23 వేలకు మహ్మద్ ఉస్సేన్, 7వ దుకాణం రూ.7,500 లకు అబ్దుల్ నబీ, 8వ దుకాణం రూ.32 వేలకు ఫెరోజ్ ఖురేషి దక్కించుకున్నారు.
నేడు వాహనాల వేలం
అనంతగిరి: ఎకై ్సజ్ శాఖ పరిధిలో ఆయా కేసు ల్లో పట్టుబడిన మూడు బైక్‌లకు బుధవారం వేలం నిర్వహించనున్నట్లు వికారాబాద్ ఎకై ్సజ్ సీఐ రాఘవీణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు తమ కార్యా లయం ఆవరణలో వేలం ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల వారు వేలం పాటలో పాల్గొన వచ్చిని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 8712658755లో సంప్రదించాలని సూచించారు.
బాల్య వివాహాలను అరికడదాం
అనంతగిరి: బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి బాధ్యత తీసుకోవాలని బాల రక్షణ భవన్ కోఆర్డినేటర్ కాంతారావు అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని సీ్త్ర శక్తి భవనంలో సాధన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించరాదని అన్నారు. బాల్య వివాహా లు జరుగుతున్నట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సాధన సంస్థ డైరక్టర్ మురళీమోహన్, సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జ్ అలీ మొద్దీన్, సాధన కోఆర్డినేటర్ నర్సింలు, సిబ్బంది యాదయ్య, జ్యోతి, రాములు, అంజయ్య, సఖి కోఆర్డినేటర్ యశోద, భరోసా ఇన్‌చార్జ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఏకగ్రీవం
నూతన కమిటీ ఏకగ్రీవం


