● అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: తాండూరు నియోజకవర్గంలో మైనార్టీ లు ఎక్కువగా ఉన్నందున వారి కోసం పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కోరారు. గురువారం శాసనసభలో మరోసారి మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తాండూరు సమస్యలనుప్రస్తావించారు. హైదరాబాద్ తరహాలో వికారాబాద్ పట్టణ శివారులోని శివారెడ్డి పేట్ శివసాగర్ చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. తాండూరు పట్టణంలో గొల్ల చెరువును అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.స్పందించిన మంత్రి సీతక్క ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్నట్లు తెలిపారు.
యాజమాన్య హక్కులు కల్పించాలి:
శాసన మండలిలో పట్నం
తాండూరు: జిల్లాలో దశాబ్దాలుగా అటవీ భూము లను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రి కొండా సురేఖను కోరారు. గురువారం మండలిలో జరిగిన ప్రత్యేక చర్చలో జిల్లాలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ఎక్కువ మంది అటవీ భూములను సాగు చేసుకుంటు న్నారని తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులకు హక్కులు కల్పిస్తే వారి ఉపాధికి సమస్య ఉండదన్నారు. స్పందించిన మంత్రి కొండా సురేఖ ఈ అంశాన్ని నోట్ చేసుకున్నట్లు తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి


