అలరించిన జడ కొప్పు కోలాటం
కళలు అంతరించిపోతున్న ప్రస్తుత కాలంలో ఇప్పటికీ భజనాలపై ఆసక్తితో ఆ గ్రామంలో చిన్నారులు నేర్చుకుంటున్నారు. మండల పరిధిలోని సిరిగిరిపేట్ గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం జడ కొప్పు కోలాటం గ్రామస్తులను అలరించింది. ప్రత్యేక దుస్తులు ధరించిన పిల్లలు చూడముచ్చటగా ఆడారు. దీంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గ్రామపెద్దలు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. – తాండూరు రూరల్
లేగదూడకు బారసాల
లేగదూడకు ఓ రైతు బారసాల చేసిన సంఘటన మండల పరిధిలోని డీకేతండాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన రమేశ్‌నాయక్ అనే రైతు ఆవుకు మగ లేగదూడ జన్మించింది. దీనికి ఉగాది పండుగ వరకు 11 రోజులైంది. ఈ నేపథ్యంలో ఆయన తన పొలంలోనే తొట్టెల ఏర్పాటు చేసి డోలారోహణం నిర్వహించాడు. దూడకు రాము అనే నామకరణం చేశాడు. – ధారూరు


