ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి
కుల్కచర్ల: ప్రతిఒక్కరూ ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని ముజాహిద్‌పూర్ గ్రామంలో ఆర్టీసీ కండక్టర్ చంద్రయ్య ఆధ్వర్యంలో భద్రాచలం రాములోరి తలంబ్రాలు పొందేందుకు నాయకులు, గ్రామస్తులు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీతారాముల కల్యాణం తలంబ్రాలను పొందేందుకు భక్తులు, మండల పరిధిలోని ప్రజలు ఆర్టీసీ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు అనంతయ్య, భీమయ్య, కృష్ణయ్య, సోమలింగం, బాలకృష్ణ, శ్యామ్, సోమలింగం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్


