అధికారుల తీరుపై బీజేపీ నాయకుల ఆగ్రహం
పూడూరు: మండలంలో సన్నబియ్యం పంపిణీ వాయిదా పడింది. పక్క మండలంలో బియ్యం ఇస్తున్నారు మాకు ఎందుకు ఇవ్వడంతో లేదని డీలర్లపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పే వరకు బియ్యం ఇవ్వరాదని సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పంపిణీ ఆపేశామని డీలర్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేయడం లేదని సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్ అధికారులను నిలదీశారు. మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్‌రెడ్డితో కలిసి రేషన్ షాప్‌లను తనిఖీ చేశారు.


