సరిహద్దులో అప్రమత్తత అవసరం
● కోత్లాపూర్ చెక్‌పోస్ట్ వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయండి ● మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపాలి ● తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు రూరల్: రాష్ట్ర సరిహద్దు పోలీస్‌స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన గౌతపూర్ సమీపంలోని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ డైరీ, కేసుల రిజిస్టర్, అరెస్ట్‌ల రికార్డు, రోల్‌కాల్ రిజిస్టర్, రౌడిషీట్స్ తదితర రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉన్న కరన్‌కోట్ ఠాణా పరిధిలోని కోత్లాపూర్ చెక్‌పోస్టు వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాలపై ఏమాత్రం అనుమానం వచ్చినా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై అవగాహన కల్పించాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ఉన్నారు.


