నేడు భూ భారతిపై అవగాహన సదస్సు
తాండూరు రూరల్: భూ భారతి చట్టంపై గురువారం అవగాహన సదస్సు ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ కేతావత్ తారాసింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. మండల పరిధిలోని అంతా రం రైతు వేదికలో ఉదయం 11.30గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి హాజరయ్యే ఈ సమావేశానికి రైతులు, వ్యవసాయ శాఖ అధి కారులు, నాయకులు సకాలంలో హాజరుకావాలని తహసీల్దార్ కోరారు.
వికారాబాద్ పట్టణంలో..
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో గురువారం భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మీనారాయణ బుధవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, కలెక్టర్ ప్రతీక్‌జైన్, అడిషనల్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు విచ్చేస్తారని చెప్పారు.
రేపు ద్విచక్ర
వాహనాలకు వేలం
తాండూరు: ఆబ్కారీ నేరాల్లో పట్టుబడిన రెండు స్ప్లెండర్ బైక్‌లకు ఈ నెల 25న వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ శాఖ తాండూరు సీఐ బాల గంగాధర్ బుధవారం ఓ ప్రకనటలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాండూరు ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఈ వేలం ఉంటుందని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనాలని కోరారు.
బాలకేంద్రంలో
సమ్మర్ క్యాంపు
ఈ నెల 26 నుంచి మే 26 వరకు
అనంతగిరి: వికారాబాద్‌లోని బాలకేంద్రంలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ అనురాధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి మే 26 వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఈ క్యాంపు కొనసాగతుందని చెప్పారు. నృత్యం, వాయిద్యం, చిత్రలేఖనం, కుట్టు, అల్లికలు తదితర అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఉంటుందని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 62048 24419 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
తాగునీటి సమస్యలు
తలెత్తకుండా చూడాలి
మోమిన్‌పేట ఎంపీడీఓ విజయలక్ష్మి
మోమిన్‌పేట: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం ఆమె మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు, ప్రత్యేకాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు మోటార్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యదర్శులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడొద్దన్నారు. ఆడవి పందులు రైతులు సాగు చేస్తున్న పంటలను నాశనం చేస్తున్నాయని, ఈ విషయలో వ్యవసాయాధికారులు, అటవీశాఖాధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరారు. మండల కేంద్రంలోని పశు వైద్యశాల ఆవరణలోని భగీరథ నీటి పైపునకు మరమ్మతులు చేపట్టాలని ఆరు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని పశువైద్యాధికారి గీత ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు, తహసీల్దార్ మనోహర్‌చక్రవర్తి, ఏఓ జయశంకర్, ఏఈఓలు శ్రీనివాస్, చంద్రిక, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ అబ్జర్వర్లుగా వినోద్‌రెడ్డి, నరేందర్
అనంతగిరి: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మండల, బ్లాక్ అధ్యక్షుల నియమకానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ భవన్‌లో పీసీసీ అబ్జర్వర్ల సమావేశం నిర్వహించారు. కాగా జిల్లా నుంచి ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, రాంశెట్టి నరేందర్‌ను జిల్లా అబ్జర్వర్లుగా నియమించారు. మండలాధ్యక్ష పదవి కోసం ఐదుగురి పేర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పేర్లను పంపాలని అబ్జర్వర్లకు సూచించారు.


