చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలి
నవాబుపేట: తన ఫంక్షన్ హాల్ ఎదుట ఉన్న చెట్లను నరికి వేసిన విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లింగంపల్లికి చెందిన రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాము పదిహేనేళ్ల క్రితం ఫంక్షన్ హాల్ పక్కన మొక్కలు నాటామని, ప్రస్తుతం అవి భారీ వృక్షాలుగా ఎదిగాయని తెలిపారు. ఐదేళ్ల క్రితం వీటి కింద స్తంభాలు పాతిన విద్యుత్ శాఖ అధికారులు, వైర్లకు తాకుతున్నాయనే కారణంతో నరికేశారని తెలిపారు. కొమ్మలు కొట్టాల్సిన చోట మొదళ్ల వరకు నరికేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కార్యదర్శి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు
బషీరాబాద్: మండలంలోని గొట్టిగఖుర్ధులో పంచాయతీ కార్యదర్శి విధులకు ఆటంకం కలిగించాడని ఒకరిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 24న గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయానికి వచ్చి తన విధులకు ఆటంకం కలిగించారని కార్యదర్శి ఫెరోజ్‌బేగం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్‌ఐ శంకర్ విచారణ నిమిత్తం వెంకట్‌రెడ్డిని శుక్రవారం స్టేషన్‌కు పిలిచారు. ఇదిలా ఉండగా.. తాను ఇల్లు కట్టుకునేందుకు సెక్రటరీని ఇసుక పర్మిషన్ అడిగానని, ఇందుకోసం డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతోనే తనపై కార్యదర్శి కేసు పెట్టించారని సదరు వ్యక్తి ఆరోపించారు.
నీటిని పొదుపుగా వాడుదాం
బొంరాస్‌పేట: ‘నీరే జీవనాధారం.. నీటిని పొదుపుగా వాడుతాం.. నీటిని కలుషితం కానివ్వం’ అంటూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. శుక్రవారం గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు నీటి ప్రాముఖ్యతను వి వరిస్తూ చైతన్యం చేస్తున్నారు. నీటి వృథా, కా లుష్యం, వనరుల పరిరక్షణ, తాగునీటి సమస్య లు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రతిజ్ఞలు చేస్తున్నా రు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తలెత్తే సమస్యలను సైతం వివరిస్తున్నారు. ఇందులో అంగన్‌వాడీలు,ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ సి బ్బంది,గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై
జాగ్రత్తగా ఉండాలి
ఎస్‌బీఐ మేనేజర్ యమున శ్రీవల్లి
పూడూరు: ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ పూడూరు మేనేజర్ యమున శ్రీవల్లి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఆవరణలో ఖాతాదారులకు బ్యాంకింగ్ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ఇతరులకు తెలపవద్దని, ఫోన్‌లు వచ్చినా స్పందించరాదని తెలిపారు. కేంద్ర ప్రఽభుత్వం అందిస్తున్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. కళాజాత బృందంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్‌పటేల్, నాయకులు సుభాన్‌రెడ్డి, అశోక్, గోపాల్‌నాయక్, జంగయ్య, రామకృష్ణ, గౌస్, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు
కార్మికుడి మృతి
శంకర్‌పల్లి: ఓ కార్మికుడు బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోకిల పోలీసులు తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన మడకామి(23) బతుకుదెరువుకు వలస వచ్చాడు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన కేఎంఎల్ కన్‌స్ట్రక్షన్స్‌లో గురువారం 8వ అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు పరిస్థితి విషమంగా ఉందని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. ఈ క్రమంలో ఆయన మార్గమధ్యలోనే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలి
చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలి


