గ్రూప్‌–1 ఉద్యోగిగా తాండూర్‌ ఎకై ్సజ్‌ సీఐ | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ఉద్యోగిగా తాండూర్‌ ఎకై ్సజ్‌ సీఐ

Sep 28 2025 8:15 AM | Updated on Sep 28 2025 8:15 AM

గ్రూప

గ్రూప్‌–1 ఉద్యోగిగా తాండూర్‌ ఎకై ్సజ్‌ సీఐ

తాండూరు: తాండూరు ఎకై ్సజ్‌ సీఐ ఆదిశేషిరెడ్డి గ్రూప్‌–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యా రు. ఎకై ్సజ్‌ శాఖ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆదిశేషిరెడ్డి తాండూరు ఎకై ్సజ్‌ ఇన్‌చార్జి సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో వెలువడిన గ్రూప్‌–1 ఫలితాల్లో ఆదిశేషిరెడ్డి ఉత్తమ ర్యాంకు సాఽఽధించడంతో పోలీసు శాఖలో డీఎస్పీగా ఎంపికయ్యారు. శనివారం శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామకపత్రాలు అందుకున్నారు.

ప్రభుత్వానికి నివేదిస్తాం

తహసీల్దార్‌ పురుషోత్తం

మర్పల్లి: పంటనష్ట పరిహారం అంచానా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తహసీల్దార్‌ పురుషోత్తం అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని కల్‌ఖోడ, రావులపల్లి, మర్పల్లి తండాలో పాడైన పంటలను, రోడ్లను పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఐ అబ్ధుల్‌ రహూఫ్‌ ఆర్‌ఐమావరెడ్డి ఉన్నారు.

అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి

మృతదేహం లభ్యం

బంట్వారం: అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. బంట్వా రం ఎస్‌ఐ విమల తెలి పిన ప్రకారం.. కోట్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన చింతకింది రవికుమార్‌ (35), ప్రేమ్‌ కుమార్‌ ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి బైక్‌పై బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌కు వెళ్లా రు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కొత్తపల్లి చె రువు అలుగు ఉధృతిలో బైక్‌ అదుపు తప్పి ఇద్ద రూ కింద పడ్డారు. ఆ సమయంలో సుల్తాన్‌పూ ర్‌ గ్రామస్తులు చెరువు గట్టు వద్ద నుంచి గమనించి ప్రేమ్‌కుమార్‌ను కాపాడారు. రవికుమార్‌ మాత్రం అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. శనివారం పోలీసులకు సమాచా రం అందడంతో ఎస్‌ఐ విమల సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్య లు చేపట్టారు. కిలో మీటరు దూరంలో రవికుమార్‌ మృతదేహన్ని గుర్తించి స్థానికుల సహయంతో బయటికి తీశారు. మృతుడు స్థానికంగా కూలీ పనులు చేస్తూ ఒంటరిగా జీవించేవాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పో స్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

గుట్కా అమ్మకాలపై కఠిన చర్యలు

దోమ: గుట్కా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వసంత్‌జాదవ్‌ అన్నారు. దోమ మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్కా, పొగాకు తదితర పాన్‌ మసాలాలు తిని అనేకమంది కేన్సర్‌ బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వీటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రూప్‌–1 ఉద్యోగిగా తాండూర్‌ ఎకై ్సజ్‌ సీఐ 1
1/2

గ్రూప్‌–1 ఉద్యోగిగా తాండూర్‌ ఎకై ్సజ్‌ సీఐ

గ్రూప్‌–1 ఉద్యోగిగా తాండూర్‌ ఎకై ్సజ్‌ సీఐ 2
2/2

గ్రూప్‌–1 ఉద్యోగిగా తాండూర్‌ ఎకై ్సజ్‌ సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement