
నీట మునిగిన పంటలు
మోమిన్‌పేట: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా పాడయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు ధ్వంసమయ్యాయి. నందివాగు పరివాహక ప్రాంతంలోని పంటలు నీట మునిగాయి. రావుల, కోల్కుంద, గోవిందాపూర్, రాళ్లగుడుపల్లి, కాస్లబాదు, మేకవనంపల్లి, మల్లారెడ్డిగూడెం, రాంనాథ్‌గుడుపల్లి గ్రామాలని పెద్దవాగు పరివాహక ప్రాంతంలోని పంటలకు పూర్తి నష్టం వాటిల్లింది. దుర్గంచెర్వు అలుగు ఉధ్రుతికి రోడ్డు గుంతలమయమైంది. టేకులపల్లిలో ఇళ్లలోకి వరద చేరి ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.