రూ.81 లక్షలతో సీసీ రోడ్లు | - | Sakshi
Sakshi News home page

రూ.81 లక్షలతో సీసీ రోడ్లు

Sep 29 2025 9:37 AM | Updated on Sep 29 2025 9:37 AM

రూ.81 లక్షలతో సీసీ రోడ్లు

రూ.81 లక్షలతో సీసీ రోడ్లు

దోమ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని బొంపల్లి, బాస్‌పల్లి, గోడుగోనిపల్లి, దోర్నాల్‌పల్లి, మైలారం, మోత్కూర్‌ గ్రామాలలో రూ.81లక్షలతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, యూజీడీ, హైమాస్ట్‌ లైట్లు, పంచాయతీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవరెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శాంతుకుమార్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, బద్రి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌, మాజీ సర్పంచ్‌లు సురేశ్‌, అనంతయ్య, రాములు, యాదయ్యసాగర్‌, పార్టీ సీనియర్‌ నేతలు రాఘవేందర్‌రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్‌, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, బాల్‌రాజ్‌, యాదగిరి, శేఖర్‌, రాములు, బషీర్‌, ఇంతియాజ్‌, హైమద్‌, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోత్కూర్‌ గ్రామంలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను కార్యకర్తలతో కలసి ప్రారంభించారు. బొంపల్లి గ్రామంలో సింగిల్‌ ఫేస్‌ మోటర్‌ను ప్రారంభించి గ్రామస్తులకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఓటు చోరీతోనే అధికారంలోకి బీజేపీ

పరిగి: ఓటు చోరీతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన పట్టణ కేంద్రంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆత్మ కమిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. సుల్తాన్‌పూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీజేపీ ప్రభుత్వంపై ఓటు చోర్‌ గద్దే చోడ్‌ అనే నినాదానికి రాష్ట్రం మద్దతు తెలుపుతోందన్నారు. దొంగ ఓట్లపై రాహుల్‌గాంధీ పోరాడుతుంటే ఎన్నికల కమిషన్‌చే కేసులు పెట్టించడం సరికాదన్నారు. బీజేపీ ఓట్‌ చోరీతో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ప్రతి గడప గడపకు చేరవేసే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ నియోజకర్గ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఏ లక్ష్మీకుమారి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement