పండుగ పూట పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట పరేషాన్‌

Sep 29 2025 9:37 AM | Updated on Sep 29 2025 9:37 AM

పండుగ పూట పరేషాన్‌

పండుగ పూట పరేషాన్‌

‘ఇందిరమ్మ’కు ఇసుక కొరత ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక దొరకక మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 8లోu 9లోu

‘ఇందిరమ్మ’కు ఇసుక కొరత ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక దొరకక మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

వికారాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెండింగ్‌ పెడుతున్నారు. దీంతో పండుగపూట సైతం పస్తులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి నాలుగు నుంచి ఎనిమిది నెలల వరకు వేతనాలు విడుదల చేయడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడో ఒకప్పుడు ఉండే ఈ సమస్య కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మరింత జఠిలమైందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదిరోజులు ఆలస్యంగా ఖాతాల్లో జమ చేసినా ప్రభుత్వంపై మండిపడే ఉద్యోగ సంఘాలు వీరి విషయంలో మాత్రం నోరుమెదపడం లేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, పోలీసుల టీఏ, డీఏ బిల్లులు సైతం ఆరు నెలలుగా అందడం లేదని పేర్కొంటున్నారు. ఆయా కార్యాలయాల నిర్వహణ బిల్లులు పాస్‌ కావటం లేదు. అప్పులు చేసి కార్యాలయ విధులు నిర్వహించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన చేపట్టినా అందని వేతనం

జిల్లాలో వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సుమారు 800 మంది, విద్యాశాఖలో 750 మంది, డీఆర్డీఏలో 200 మంది ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందడంలేదు. గతంలో రెండు, మూడు నెలలు ఆలస్యమవగా ప్రస్తుతం ఒక్కో శాఖలో నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలలుగా వేతనాల కోసం పడిగాపులుకాస్తున్నారు. మండల విద్యావనరుల కేంద్రాల్లో, కస్తూర్భా గాంధీ గురుకులాల్లో విధులు నిర్వహించే నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, సీఆర్‌పీలు, ఎంఐసీలు, పీటీఐలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఐఈఆర్సీలు వేతనాలు అందని వారిలో ఉన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహించే గెస్ట్‌ లెక్చరర్లు ఎనిమిది నెలలుగా వేతనాలు అందటంలేదంటూ ఇటీవల ఆందోళ న చేపట్టినా ఎటువంటి ఫలితం దక్కలేదు. డీఆర్డీఏ శాఖలో అటెండర్లు, సీసీలు, ఏపీఓలు, టీఏ లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఏపీఎంలు తదితరులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు.

చక్కదిద్దకుంటే రోడ్డెక్కుతాం

రాష్ట్రంలో దసరా ఘనంగా నిర్వహించుకుంటారు. ఇంటిల్లిపాది కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికీ వేతనాలు అందక.. బి ల్లులు రాక పండుగకు పస్తులు తప్పేట్లు లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పది నుంచి 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఓ పక్క క్రమబద్ధీకరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా ప్రభుత్వం వేతనాల విడుదలలోనూ అలసత్వం వహిస్తోంది. అప్పు పుట్టడంలేదని ఆవేదన చెందుతున్నారు. వేతనాల విడుదలలో వివక్ష తగదంటున్నారు. పరిస్థితి చక్కదిద్దకుంటే రోడ్డెక్కక తప్పదని హెచ్చరిస్తున్నారు.

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు పెండింగ్‌

నాలుగు నుంచి ఎనిమిది నెలలుగా ఇబ్బంది పడుతున్న హెల్త్‌,ఎడ్యుకేషన్‌, డీఆర్డీఏ ఉద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగులకు అందని బిల్లులు

అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement