
ఆరిలోవ : జీవీఎంసీ ఆదర్శనగర్‌లో ఆరెంజ్ లాడ్జిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. థాయ్‌లాండ్ నుంచి ఈనెల 5న ఇద్దరు యువతులను మహేష్ అనే వ్యక్తి విశాఖ తీసుకొచ్చాడు. వారితో పాటు స్థానికంగా ఉంటున్న మరో మహిళను ఆదర్శనగర్‌లో ఆరెంజ్ లాడ్జిలో ఉంచాడు.
వారి మధ్య ఏం జరిగిందో గానీ గురువారం థాయ్‌లాండ్‌కు చెందిన ఓ యువతిపై మహేష్ చేయిచేసుకున్నాడు. దీంతో ముగ్గురు మహిళలు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విదేశీ మహిళలు కావడంతో సీపీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని టాస్క్‌ఫోర్స్ పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయంత్రం ఈ లాడ్జిపై దాడి చేశారు.
పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న మహేష్ ముందుగానే అక్కడ నుంచి పరారయ్యాడు. లాడ్జి నిర్వాహకుడి నుంచి వివరాలు సేకరించి ఫిర్యాదు చేసిన ముగ్గుర్ని కేజీహెచ్‌కు తరలించారు. పరారైన మహేష్ కోసం గాలిస్తున్నారు. కేసును ఆరిలోవ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment