
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట, తొట్లకొండ బీచ్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నటుడు రాజ్ తరుణ్, నటి మనీషా కందూర్ నటిస్తున్న భలే ఉన్నాడే సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్‌వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతోందని, హీరో రాజ్ తరుణ్ న్యూలుక్‌లో కనిపించబోతున్నారని దర్శకుడు జె. శివసాయి వర్ధన్ తెలిపారు. ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ ప్రముఖ పాత్రలో నటించగా, అమ్ము అభి (నారప్ప ఫేమ్), కృష్ణ భగవాన్, హైపర్ ఆది ఇతర పాత్రలో నటిస్తున్నారన్నారు. సంగీతం శేఖర్ చంద్ర అందిస్తున్నారు. మరో 8 రోజుల పాటు బీచ్‌రోడ్డు ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment