హెల్మెట్‌ వాడకం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ వాడకం తప్పనిసరి

Published Fri, Feb 28 2025 12:54 AM | Last Updated on Fri, Feb 28 2025 12:53 AM

హెల్మెట్‌ వాడకం తప్పనిసరి

హెల్మెట్‌ వాడకం తప్పనిసరి

ఇన్‌చార్జ్‌ డీటీవో ఆర్‌సీహెచ్‌ శ్రీనివాస్‌

గోపాలపట్నం: ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ఇన్‌చార్జ్‌ డీటీవో ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు నగరంలో పలుచోట్ల వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాహనం నడిపే వ్యక్తితో పాటు, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్‌ ధరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతోపాటు, 3 నెలలు లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్‌ రద్దు చేసిన సమయంలో వాహనం నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement