పోలింగ్ కేంద్రాల దగ్గరే తిష్టవేసిన టీడీపీ, జనసేన నేతలు
పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలోనూ టీచర్ల వెంటే.. కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లుగా వ్యవహరించిన అధికార పార్టీ నేతలు ప్రశాంతంగా ముగిసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ జిల్లాలో 87.57 శాతం పోలింగ్ నమోదు గురువులు ‘ఫస్ట్’ మార్క్ ఎవరికిచ్చారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతలు హల్‌చల్ చేశారు. తాము మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటేయాలంటూ ఉపాధ్యాయులను చివరి నిమిషం వరకూ ప్రలోభ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల వద్ద కలియతిరిగారు. చాలాచోట్ల అధికార పార్టీకి చెందిన నేతలు ఉపాధ్యాయుల స్థానంలో ఏజెంట్లుగా వ్యవహరించారు. ఓటు వేసేందుకు బూత్‌లోకి వెళ్లే సమయంలో టీచర్లను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. మొత్తంగా విశాఖ జిల్లా పరిధిలో 87.34 శాతం మంది గురువులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment