సేవలను మరింత మెరుగుపరచాలి
విశాఖ సిటీ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై మార్గదర్శకాలు ఆయన చేశారు. ఉచిత గ్యాస్, రేషన్ బియ్యం పంపిణీ, తూనికలు, కొలతలు, ఇతర ప్రమాణాలు పాటించే క్రమంలో జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని చెప్పారు. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం బరువు విషయంలో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు సకాలంలో అందించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీఎస్‌వో కల్యాణి, పౌర సరఫరా శాఖ డీఎం శ్రీలత, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment