
హోటల్‌లో అగ్నిప్రమాదం
అల్లిపురం: డాబాగార్డెన్స్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద గల ఎల్‌జీ హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ ప్యానెల్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో సెల్లార్ మొత్తం పొగతో నిండిపోయింది. ఆ పొగ హోటల్‌లోని అన్ని అంతస్తుల్లోకి వ్యాపించింది. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్‌ఐ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్‌లో ఫైర్ ఎక్విప్‌మెంట్ ఉండటంతో ఫైర్ సిబ్బంది వచ్చేలోగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ లోగా సూర్యాబాగ్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కరెంట్ లేకపోవడంతో హోటల్ మొత్తం చీకటిగా మారిపోయింది. ఈ క్రమంలో ఎస్‌ఐ సెల్‌ఫోన్ టార్చి సహకారంతో అన్ని అంతస్తుల్లోని 9 గదుల్లో బస చేసిన వారిని నిద్రలేపి అప్రమత్తం చేశారు. వారందరినీ కిందకు తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

హోటల్‌లో అగ్నిప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment