డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో 2024 ఏడాదికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అభిప్రాయ సేకరణ ప్రారంభమైందని, నగర ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశాల మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యర్థాల సేకరణ, తరలింపు, రోడ్లు, కాలువల శుభ్రత, మార్కెట్లు, బజార్లు, పార్కులు, ఉద్యానవనాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కేంద్రాలు, వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన తదితర అంశాలపై ప్రజల తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అడిగే ప్రశ్నలకు నేరుగా అభిప్రాయం చెప్పవచ్చన్నారు. అలాగే https://sbmurban.org/లో గానీ, Swachata MOHUA యాప్ ద్వారా గానీ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment