
ఎమ్మెల్యేకు నిబంధనలు పట్టవా..
మధురవాడ : టీడీపీ నాయకులకు ఎన్నికలు నిబంధనలు పట్టలేదు. మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 120వ పోలింగ్ కేంద్రం వద్దకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేరుగా వచ్చారు. ఆయన వెంట వచ్చిన 20 మంది టీడీపీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారు. పార్టీ రహిత ఎన్నికలకు రాజకీయ రంగు పులిమి, యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment