
ప్రశాంతంగా ద్వితీయ ఇంటర్ పరీక్షలు
విశాఖ విద్య: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి పరీక్షకు మొత్తం 38,478 మంది నమోదు చేసుకోగా, వీరిలో 401 మంది గైర్హాజరయ్యారు. 99 శాతం హాజరు నమోదైనట్లు ఆర్‌ఐవో పి.మురళీధర్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కేంద్రాలను ప్రత్యేక తనిఖీ బృందాలు పరిశీలించాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జైల్‌రోడ్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న గదుల్లోకి వెళ్లి, నిర్వహణను స్వయంగా చూశారు. విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని కొంతమంది విద్యార్థులనూ అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment