తాటిచెట్లపాలెం: కేకే లైన్ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో దంతేవాడ వరకే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ● విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్ స్పెషల్ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్– విశాఖపట్నం (58502) పాసింజర్ స్పెషల్ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది.
● విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్– విశాఖపట్నం (18516) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో దంతేవాడ–కిరండూల్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవు. ప్రయాణికులు మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment