పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పాలకొండలో ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత జగన్‌మోహన్‌రెడ్డి
పాలకొండ పట్టణంలోని పాలవలస విక్రాంత్ ఇంటి వద్దకు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.45 సమయంలో అక్కడకు చేరుకున్న జగన్.. తొలుత దివంగత పాలవలస రాజశేఖరం చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖరం సతీమణి ఇందుమతి చేతిలో చేయివేసి ధైర్యం చెప్పారు. రాజశేఖరం కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పిరియా విజయ, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్బాబు, నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, కుంభా రవిబాబు, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, గొర్లె కిరణ్‌కుమార్, గొండు కృష్ణమూర్తి, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలేరాజేష్, పేరాడ తిలక్, గొడ్డేటి మాధవి, జమ్మాన ప్రసన్న కుమార్, జయమణి, రేగాన శ్రీనివాస్, నెక్కల నాయుడుబాబు, కేవీ సూర్య నారాయణరాజు, అంధవరపు సూరిబాబు, పిరియా సాయిరాజ్, ధర్మాన కృష్ణ చైతన్య, కరిమి రాజేశ్వరరావు, మెంటాడ పద్మావతి, చింతాడ రవికుమార్, కిల్లి సత్యనారాయణ, పాలిన శ్రావణి, దుంపల లక్ష్మణరావు, చెట్టి వినయ్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలేరాజేష్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు నెక్కల నాయుడుబాబు
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
Comments
Please login to add a commentAdd a comment