పకడ్బందీగా గ్రూప్–2 పరీక్ష
విజయనగరం అర్బన్: ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరగనున్న గ్రూప్–2 మెయిన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 23వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం విజయనగరంలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ... అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డును తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఏపీపీఎస్‌సీ ప్రతినిధులు డి.మల్లికార్జునరెడ్డి, డి.నాగభూషణం, టి.నందగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్: 08922 236947 ఏర్పాటు
జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్
Comments
Please login to add a commentAdd a comment